నేడే బాహుబలి–2 | Baahubali -2 Today release | Sakshi
Sakshi News home page

నేడే బాహుబలి–2

Apr 28 2017 1:45 AM | Updated on Sep 5 2017 9:50 AM

నేడే బాహుబలి–2

నేడే బాహుబలి–2

భారతీయ సినిమాలోకం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బ్రహ్మాండమైన చిత్రం బాహుబలి–2 ప్రపంచ వ్యాప్తంగా

తమిళసినిమా: భారతీయ సినిమాలోకం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బ్రహ్మాండమైన చిత్రం బాహుబలి–2 ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలకానుంది. కొన్ని రోజులుగా తమిళంలో మాత్రం బాహుబలి–2 చిత్రం విడుదలవుతుందా? లేదా? అనే టెన్షన్‌ కొనసాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు తమిళ వెర్షన్‌ విడుదలకు నిషేధం విధించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. కార్తికేయన్‌ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో ఒక పిటిషన్‌ వేశారు. 

అందులో బాహుబలి–2 చిత్రాన్ని తమిళంలో విడుదల చేసే గో ప్రొడక్షన్స్‌ తమ వద్ద తీసుకున్న రుణాన్ని వడ్డీ సహా మొత్తం రూ.1.48 కోట్లు చెల్లించాలని, లేకుంటే చిత్ర విడుదలకు నిషేధం విధించాలని, అన్ని హక్కులను నిలుపుదల చేయాలని కోరాడు. ఈ పిటిషన్‌ గురువారం విచారణకు వచ్చింది. కేసును విచారించిన న్యాయమూర్తి ఇటువంటి కారణాలతో చిత్ర విడుదలను అడ్డుకోవడం కుదరదని తీర్పు చెప్పారు. తద్వారా తమిళంలో బాహుబలి–2 విడుదలకు అడ్డంకులు తొలగాయి. ఈ నేపథ్యంలో బాహుబలి–2 చిత్రం తమిళంలో శుక్రవారం విడుదలకానుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement