ధన్యవాదాలు చెబుతున్నారు

AWE Director Prashanth Varma About AWE Movie - Sakshi

‘‘ఇలాంటి జానర్‌లో సినిమా చేయాలని ముందుగానే అనుకున్నాను. కొందరికి ఒక్కసారి చూసిన వెంటనే అర్థం అవుతుంది. మరికొందరికి రెండు మూడు సార్లు చూశాక అర్థం అవుతుంది. నా నెక్ట్స్‌ మూవీ కూడా ఇలానే ఉంటుంది’’ అన్నారు ప్రశాంత్‌ వర్మ. నాని సమర్పణలో వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై కాజల్‌ అగర్వాల్, రెజీనా, నిత్యామీనన్, ఈషా రెబ్బా, శ్రీనివాస్‌ అవసరాల, మురళీ శర్మ, ప్రియదర్శి తదితరులు ముఖ్య తారలుగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘అ!’. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం దర్శకుడు ప్రశాంత్‌ వర్మ పాత్రికేయులతో చెప్పిన విశేషాలు.

► నేను ఇంజనీరింగ్‌ చేశాను. డాక్యుమెంటరీలు, మ్యూజిక్‌ వీడియోలు, షార్ట్‌ ఫిల్మ్స్,యాడ్‌ ఫిల్మ్స్‌ చేశాను.  ‘అ!’ సినిమాకు ఇన్స్‌పిరేషన్‌ ఏమీ లేదు. ఒరిజినల్‌గా ఏమైనా రాద్దాం అనుకున్నాను. ఎక్స్‌ప్రెషనిజమ్‌ అనే జానర్‌లో క్యారెక్టర్స్‌ డిజైన్‌ చేసుకున్నాను. ఈ సినిమాను నేనే స్వయంగా నిర్మిద్దాం అనుకున్నాను. చేప వాయిస్‌ ఓవర్‌ కోసం వెళ్తే నానీగారు ‘నేనే నిర్మిస్తా’ అన్నారు.

► నానీగారికి కథ నచ్చడంతో ఫుల్‌ స్క్రిప్ట్‌ ఇచ్చాను. ఆ తర్వాత సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ఈ సినిమా నేను చేసుంటే హిట్‌ అయినా ఫ్లాప్‌ అయినా పట్టించుకునేవాణ్ణి కాదు. కానీ నానీగారు నిర్మాత కాబట్టి ఆయనకున్న క్రెడిబులిటీ పాడు చేయకూడదు. ఇదే విషయాన్ని ఆయనకు ముందే చెప్పా. ఆయన కాన్ఫిడెంట్‌గా సినిమా చేద్దాం అన్నారు.

► ఈ సినిమా నా కోసం కంటే నానీ, ప్రశాంతీగారి కోసం, రాబోయే యువ దర్శకుల కోసం హిట్‌ కావాలని కోరుకున్నాను. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌ మళ్లీ చూడలేనేమో అని కొందరు, ఇంకా కొత్త కథలు రాయాలని మరికొందరు అన్నారు. ఇవే నాకు బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌. సినిమా చూసి కంగ్రాట్‌ చెప్పకుండా థ్యాంక్స్‌ చెప్పడం చాలా గొప్పగా అనిపించింది.

► కమర్షియల్‌ సినిమాలు తీసే దర్శకులు చాలామందే ఉన్నారు. ఇలాంటి సినిమా చేయాలని ముందే అనుకున్నాను. కష్టమేమీ అనిపించలేదు. ఈ సినిమాతో అందన్నీ మెప్పించాలని ఏం అనుకోలేదు. నేను అనుకున్న జానర్‌ ఆడియన్స్‌ను మెప్పించాలనే ఉద్దేశంతోనే చేశాను.

► డబ్బు, అవార్డుల కోసం ఈ సినిమా చేయాలేదు. మా టీమ్‌లో ఎవరో ఒకరికి అవార్డ్‌ వస్తుంది అనుకుంటున్నాను. మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశాము. ఈ సినిమా కంటే ముందు చాలామంది నిర్మాతలకు కథలు చెప్పాను. స్టార్ట్‌ అవుతాయనుకుంటుండగా ఆగిపోయాయి. నా దగ్గర సుమారు 30కి పైగా కథలు ఉన్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top