థానోస్‌ అంతం ఎలా?

Avengers: Endgame ticket bookings now live across India - Sakshi

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’. రుస్సో బ్రదర్స్‌  దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. హాలీవుడ్‌ నటుడు రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ నటì ంచిన ఈ చిత్రంలో క్రిస్‌ ఇవాన్స్, మార్క్‌ రఫాలో, క్రిస్‌ హేమ్స్‌వర్త్, స్కార్లెట్‌ జాన్సన్‌ వంటి స్టార్స్‌ నటించారు. మార్వెల్‌ స్టూడియోస్‌ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500కు పైగా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

‘అవెంజర్స్‌’ సిరీస్‌ నుంచి వస్తున్న చివరి సూపర్‌హీరో చిత్రం ఇదేన ని హాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కాబోతోంది. గత చిత్రంలో థానోస్‌ శక్తితో కనిపించకుండాపోయిన అవెంజర్స్‌ మళ్లీ తిరిగి ఎలా వచ్చారు? థానోస్‌ను ఎలా అంతం చేశారన్నదే ఈ చిత్ర కథ. థానోస్‌ పాత్రకి తెలుగులో రానా డబ్బింగ్‌ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఏ.ఆర్‌.రెహమాన్‌ రూపొందించిన పాట విశేష ప్రేక్షకాదరణ పొందింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top