కామెడీ జిగేల్‌ | arun adith, siddhi idnani jigel movie starts | Sakshi
Sakshi News home page

కామెడీ జిగేల్‌

Jul 6 2018 12:26 AM | Updated on Jul 6 2018 12:26 AM

arun adith, siddhi idnani jigel movie starts - Sakshi

సిద్ధీ ఇద్నానీ, అరుణ్‌ ఆదిత్‌

‘కథ’ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో అరుణ్‌ ఆదిత్‌. ఇటీవల ‘పీయస్‌వీ గరుడవేగ’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించి, మంచి మార్కులు కొట్టేశారు. ప్రస్తుతం అరుణ్‌ ఆదిత్‌ ‘జిగేల్‌’ అనే కొత్త సినిమాలో హీరోగా నటిస్తున్నారు. శ్రీ ఇందిరా కంబైన్స్‌ పతాకంపై అల్లం నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏలూరి మల్లి దర్శకత్వం వహిస్తున్నారు.

‘జంబ లకిడి పంబ’ ఫేమ్‌ సిద్ధీ ఇద్నానీ కథానాయికగా నటిస్తున్నారు. గురువారం  ముహూర్తం జరిపి, రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మాత అల్లం నాగార్జున మాట్లాడుతూ – ‘‘భారీ తారాగణంతో, మంచి బడ్జెట్‌తో హై క్వాలిటీతో ‘జిగేల్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోగా అరుణ్‌ ఆదిత్‌ ఫర్పెక్ట్‌’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వాసు, సంగీతం: ‘మంత్ర’ ఆనంద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement