‘ఆమెకు పెళ్లైంది.. పది కేసులు ఉన్నాయ్‌’ | Arshi Khan said about herself false, says Gehana Vasisth | Sakshi
Sakshi News home page

‘ఆమెకు పెళ్లైంది.. పది కేసులు ఉన్నాయ్‌’

Oct 24 2017 6:30 PM | Updated on Oct 24 2017 6:36 PM

Arshi Khan said about herself false, says Gehana Vasisth

ముంబై: హిందీ బిగ్‌బాస్‌ రియాలిటీ షో 11వ సీజన్‌లో పోటీ పడుతున్న మోడల్, నటి ఆర్షి ఖాన్‌కు సంబంధించిన సంచలన విషయాలు వెల్లడయ్యాయి. బిగ్‌బాస్‌ షోలో పాల్గొనేందుకు ఆర్షి ఖాన్‌ సమర్పించిన వ్యక్తిగత వివరాలన్నీ తప్పు అని మరో నటి, మోడల్‌ గెహానా వశిష్ఠ్‌ ఒక వార్తా సంస్థతో చెప్పింది. వయసు, విద్యార్హతలు, పాకిస్తాన్ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిదితో రిలేషన్‌షిప్‌ గురించి ఆమె చెప్పినవన్నీ శుద్ధ అబద్ధాలని ప్రకటించింది. అంతేకాదు 50 ఏళ్ల వ్యక్తిని ఆర్షి ఖాన్‌ పెళ్లి చేసుకుందని బాంబు పేల్చింది.

‘ఆర్షి ఖాన్‌ స్వస్థలమైన భోపాల్‌ నుంచే నేను వచ్చాను. ఆర్షి ఖాన్‌ చెప్పినట్టుగా ఆమె 27 ఏళ్లు కాదు. ఆమెకిప్పుడు 32 ఏళ్లు. తన వయసును ఐదేళ్లు తగ్గించి చెప్పింది. స్కూల్‌ డే నుంచి ఆమె నాకు తెలుసు కాబట్టే ఇంత కచ్చితంగా చెప్పగలుతున్నా. బిగ్‌బాస్‌ 11లో పాల్గొనేందుకు తన విద్యార్హతలకు సంబంధించిన వివరాలు కూడా తప్పుగా చూపించింది. దీనికి సంబంధించిన ఆధారాలు నేను చూపించగలను. నోరు విప్పితే అబద్దాలాడే ఆర్షి ఖాన్‌ను బిగ్‌బాస్‌కు ఎంపిక చేయడం నాకు ఆశ్చర్యం కలిగించింద’ని గెహానా పేర్కొంది.

ఆఫ్రిదితో తనకు లైంగిక సంబంధం ఉందని ఆర్షి ఖాన్‌ గతంలో చేసిన వ్యాఖ్యలపై గెహానా స్పందిస్తూ... పాక్‌ క్రికెటర్‌ ఆఫ్రిదిని ఆమె ఎప్పుడూ ముఖాముఖి కలవలేదని, కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడలేదని వెల్లడించింది. ఆర్షి ఖాన్‌పై 10 క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటోందని.. భారత్‌, పాకిస్తాన్‌ జెండాలను అవమానించిన కేసులు కూడా ఇందులో ఉన్నాయని తెలిపింది. ఇప్పటికే జుబైర్‌ ఖాన్‌ వివాదం బిగ్‌బాస్‌లో సంచలనంగా మారింది. అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్‌ కూతురిన పెళ్లాడిన జుబైర్‌ ఈ విషయాన్ని దాచిపెట్టి బిగ్‌బాస్‌ అవకాశాన్ని దక్కించుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement