మరో వారసుడొస్తున్నాడు | Arnold Schwarzenegger trains son Joseph Baena | Sakshi
Sakshi News home page

మరో వారసుడొస్తున్నాడు

Apr 19 2016 3:10 PM | Updated on Sep 3 2017 10:16 PM

మరో వారసుడొస్తున్నాడు

మరో వారసుడొస్తున్నాడు

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే కాదు, హాలీవుడ్లోనూ వారసుల హవా కనిపిస్తోంది. ఇప్పటికే జాకీచాన్, విల్ స్మిత్ లాంటి టాప్ స్టార్స్ తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేయగా, మరో హాలీవుడ్ టాప్ స్టార్ తన...

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే కాదు, హాలీవుడ్లోనూ వారసుల హవా కనిపిస్తోంది. ఇప్పటికే జాకీచాన్, విల్ స్మిత్ లాంటి టాప్ స్టార్స్ తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేయగా, మరో హాలీవుడ్ టాప్ స్టార్ తన వారసుడిని సినిమాల కోసం సిద్దం చేస్తున్నాడు. ప్రిడేటర్, టెర్మినేటర్ వంటి సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ తన తనయుడు జోసెఫ్ బేనాను సినిమాల కోసం సిద్ధం చేస్తున్నాడు.
 
ఇప్పటికే జోసేఫ్ ఫిజిక్ మీద దృష్టి పెట్టిన ఆర్నాల్డ్ స్వయంగా తానే దగ్గరుండి జోసెఫ్తో జిమ్ చేయిస్తున్నాడు. తాజాగా వెనిస్ లోని గోల్డ్స్ జిమ్లో తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి వర్క్ అవుట్స్ చేస్తూ కనిపించారు. 18 ఏళ్ల జోసెఫ్ ప్రస్తుతం మిస్టర్ యూనివర్స్ పోటీలకు సిద్ధమవుతున్నాడు. ఆ వెంటనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇవ్వనున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement