ష్వార్జ్‌నెగ్గర్‌ స్ఫూర్తిదాత మృతి

Arnold Schwarzenegger Friend Franco Dies - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పటి హాలివుడ్‌ హీరో, కండల వీరుడైన ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్‌ స్ఫూర్తిదాత, ఆప్త మిత్రుడు ఫ్రాంకో కొలంబో శుక్రవారం నాడు ప్రమాదవశాత్తు మరణించారు. ‘నా జీవితంలోకి ఆనందాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా నిన్నెప్పుడు మరచిపోను. ఫ్రాంక్, నీవంటే నాకు ఎంతో ప్రేమ. నా జీవితం ఇంత ఆనందంగా గడవడానికి, దానికో సార్థకత చేకూరడానికి ప్రత్యక్షంగా నీవే కారణం. నిన్నెప్పటికీ మరచిపోలేను. ఇదే నా ప్రగాఢ నివాళి’ అంటూ ఆర్నాల్డ్‌ శనివారం నాడు తన బ్లాగ్‌లో రాసుకున్నారు. తమ 54 ఏళ్ల మిత్ర బంధంలో చెరిగిపోని మధుర జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయని ఆర్నాల్డ్‌ చెప్పారు.

ఇటలీలోని సర్డానియాలోని ఓ సముద్రంలో జరిగిన పడవ ప్రమాదంలో ఫ్రాంకో కొలంబో మరణించారు. ఆర్నాల్డ్‌ కన్నా ముందుగా అమెరికా వెళ్లిన కొలంబో 54 ఏళ్ల క్రితం అనుకోకుండా ఆర్నాల్డ్‌ను కలుసుకున్నారు. ఇద్దరు కలిసి వెయిట్‌ లిఫ్టింగ్‌లో శిక్షణ పొందారు. ‘పంపింగ్‌ ఐరన్‌’ పేరిట 1977లో వచ్చిన డాక్యుమెంటరీలో వీరిద్దరు ఉన్నారు. 70, 80 దశకాల్లో జరిగిన ఒలింపిక్‌ పోటీల్లో వీరిరువురు పాల్గొన్నారు. కొలంబోకు 78 ఏళ్లు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top