హిందీ ‘అర్జున్‌ రెడ్డి’ టీజర్‌ వచ్చేసింది!

Arjun Reddy Hindi Remake Kabir Singh Teaser - Sakshi

టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన బోల్డ్ మూవీ అర్జున్‌ రెడ్డి. విజయ్‌ దేవరకొండ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా ఎన్నో వివాదాల మధ్య విడుదలై భారీ వసూళ్లు సాధించింది. అంతేకాదు ప్రముఖుల ప్రశంసలు కూడా దక్కటంతో ఇతర భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు.

ముఖ్యంగా బాలీవుడ్‌లో అర్జున్‌ రెడ్డి రీమేక్‌పై భారీ హైప్‌ క్రియేట్ అయ్యింది. కబీర్‌ సింగ్‌ పేరుతో తెరకెక్కుతున్న ఈ  సినిమాకు ఒరిజినల్‌ వర్షన్‌కు దర్శకత్వం వహించిన సందీప్‌ రెడ్డి వంగా దర్శకుడు. షాహిద్‌ కపూర్‌ హీరోగా నటిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్‌ పాత్రలో అలరించనుంది. సినీ 1 స్టూడియోస్‌, టీ సిరీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. టీజర్ దాదాపు అర్జున్‌ రెడ్డి స్టైల్‌లో ఉంది. షాహిద్ లుక్స్‌తో పాటు సీన్స్‌, డైలాగ్స్‌ అన్ని అర్జున్‌ రెడ్డినే దించేసినట్టుగా అనిపిస్తుంది. మరి టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన అర్జున్‌ రెడ్డి, బాలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top