పెళ్లిపై నమ్మకం ఉంది : అర్జున్‌ కపూర్‌

Arjun Kapoor About marriage Proposals With Malaika Arora - Sakshi

బాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ కపుల్స్‌ లిస్ట్‌లో ఓ జంట ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఆ జంటలో అబ్బాయికి, అమ్మాయికి మధ్య ఉండే వయసు తేడానే వారిని ప్రత్యేకంగా గుర్తించేలా చేస్తుంది. అర్జున్‌ కపూర్‌, మలైకా అరోరా వ్యవహారంపై నిత్యం బీటౌన్‌లో చర్చలు జరుగుతూనే ఉంటాయి. త్వరలోనే వీరు పెళ్లి పీఠలెక్కబోతున్నారని జోరుగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే తాను ఇప్పుడే పెళ్లి చేసుకోవడం లేదని, అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటామని అర్జున్‌ కపూర్‌ కుండబద్దలు కొట్టేశాడు.

అయితే మీడియాతో ఈ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడటం ఇష్టం లేని అర్జున్‌ కపూర్‌.. ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ పలు విషయాలను వెల్లడించారు. పెళ్లిపై నమ్మకం ఉందా అని తనకు ఎదురైన ప్రశ్నకు సమాధానంగా.. తన చుట్టూ పెళ్లి చేసుకున్నవారు ఎంతో మంది సంతోషంగా ఉన్నారని, తాను కూడా బ్రోకెన్‌ ఫ్యామిలీ (బోనీ కపూర్‌ రెండు వివాహాలు చేసుకోవడం గురిం‍చి మాట్లాడుతూ) నుంచి వచ్చానని   అయినా తనకు పెళ్లిపై నమ్మకం ఉందంటూ, బందంలో ఉండే ఎత్తుపల్లాలను అన్నింటిని చూడాలని, చివరకు ఆ బంధం ఎక్కడికి తీసుకువెళ్తుందో చూడాలి అంటూ వేదాంతం వల్లించాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top