అనుష్కకు కల్యాణ ఘడియలు? | Anushka Shetty getting married to a Businessman? | Sakshi
Sakshi News home page

అనుష్కకు కల్యాణ ఘడియలు?

Oct 20 2016 1:23 AM | Updated on Sep 4 2017 5:42 PM

అనుష్కకు కల్యాణ ఘడియలు?

అనుష్కకు కల్యాణ ఘడియలు?

మూడు పదుల వయసు పైబడిన నటీమణులకు ఇంటా బయట పెళ్లి ఒత్తిడి పెరగడం సర్వసాధారణం.

మూడు పదుల వయసు పైబడిన నటీమణులకు ఇంటా బయట పెళ్లి ఒత్తిడి పెరగడం సర్వసాధారణం. 34 ఏళ్ల నటి అనుష్కకు అలాంటి తాకిడి ఉంటుందనడం అనూహ్యమేమీ కాదు. ఉన్నత విద్యను పూర్తి చేసిన అనుష్క ఆదిలో యోగా శిక్షణ పొంది, తర్వాత యోగా టీచర్‌గా పలువురికి శిక్షణ ఇచ్చారు. అలాంటి బ్యూటీని విధి నటిని చేసింది. అనుష్క 2005లో వెండితెరకు పరిచయం అయ్యారు.
 
అలా తొలి రోజుల్లో అందాలారబోస్తూ అవకాశాలు పెంచుకుంటూ వచ్చిన అనుష్కకు అరుంధతి చిత్రం ఆమె నట దిశను ఒక్కసారిగా మార్చేసింది. స్టార్ నాయకిగా తమిళం, తెలుగు భాషల్లో అగ్రనాయకిగా రాణిస్తున్నారు. ఈ రెండు భాషల్లో అగ్రనాయకులందరితోనూ డ్యూయెట్లు పాడేసి ఆ సరదాను తీర్చుకున్నారు. ప్రస్తుతం తమిళంలో ఎస్-3 చిత్రంలో సూర్యతోనూ, ద్విభాషా చిత్రం బాహుబలి-2, హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం భాగమతి, భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయలో నటిస్తున్నారు.
 
వీటిలో ఎస్-3 చిత్రం డిసెంబర్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. బాహుబలి-2 వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఇలా ఉండగా అనుష్క కొత్త చిత్రాలను అంగీకరించడం లేదనే ప్రచారం జోరందుకుంది. కారణం ఈ అమ్మడి కి కల్యాణ ఘడియలు దూసుకొస్తున్నాయని సమాచారం. నటిగా ప్రశంసలు అందుకుంటున్న అనుష్క వ్యక్తిగతంగా పలు వదంతులను ఎదుర్కొంటున్నారన్నది గమనార్హం.
 
నటుడు ఆర్యతో ప్రేమకలాపాలంటూ అప్పట్లో గాసిప్స్ హల్‌చల్ చేశాయి. ఇక ఒక తెలుగు నటుడితో డేటింగ్ అంటూ ప్రచారం హోరెత్తింది. ఇటీవల వివాహితుడైన నిర్మాతను పెళ్లాడబోతున్నట్టు ప్రచారం కలకలం పుట్టించింది. కాగా వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టే విధంగా అనుష్క కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూడడంలో వేగం పెంచినట్లు తాజా సమాచారం. అదే విధంగా హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లిని నిశ్చయించినట్లు సినీ వర్గాల టాక్. బాహుబలి-2 విడుదల తరువాత అనుష్కకు డుండుండుం...పీపీపీనేననే గుసగుసలు వినిపిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement