
ఒకరికొకరు గెస్ట్‌లుగా...
నాగార్జున, అనుష్కలది కనువిందైన జంట. అసలు అనుష్కను హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ చేసిందే నాగ్. అందుకే నాగ్ అంటే అనుష్కకు విపరీతమైన రెస్పెక్ట్.
నాగార్జున, అనుష్కలది కనువిందైన జంట. అసలు అనుష్కను హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ చేసిందే నాగ్. అందుకే నాగ్ అంటే అనుష్కకు విపరీతమైన రెస్పెక్ట్. వీరిద్దరూ యాదృచ్ఛికంగా ఒకరి సినిమాలో మరొకరు గెస్ట్‌గా చేస్తున్నారు.
నాగార్జున, కార్తీ కాంబినేషన్‌లో రూపొందుతున్న మల్టీ స్టారర్ మూవీలో అతిథి పాత్రను అనుష్క చేయనున్నారట. మరోపక్క, అనుష్క నాయికగా రూపొందుతున్న ‘సైజ్ జీరో’లోనేమో నాగార్జున అతిథి పాత్ర చేయనున్నారట.
ఇంకా విశేషం ఏమిటంటే, ఆ సినిమాలో కార్తీ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారట. మరో అతిథి పాత్రను శ్రుతీహాసన్ చేస్తున్నారు. మొత్తం మీద ‘సైజ్ జీరో’నో కానీ, అతిథి పాత్రలు మాత్రం ఒకటికి మూడన్న మాట! ఈ మూడు అతిథి పాత్రలూ ఆ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తే, నాగ్ - కార్తీ మల్టీస్టారర్‌కి అనుష్క చేసే అతిథి పాత్ర హైలైట్ అవుతుందన్న మాట.