ముచ్చటగా మూడోసారి! | Anjali does a special role in Ram's Taramani | Sakshi
Sakshi News home page

ముచ్చటగా మూడోసారి!

Jul 28 2015 11:20 PM | Updated on Sep 3 2017 6:20 AM

ముచ్చటగా మూడోసారి!

ముచ్చటగా మూడోసారి!

పదహారణాల తెలుగమ్మాయి అంజలి చేతిలో ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కలిపి అరడజను సినిమాల వరకూ ఉన్నాయి. సో.. కథానాయికగా ఫుల్ బిజీ.

 పదహారణాల తెలుగమ్మాయి అంజలి చేతిలో ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కలిపి అరడజను సినిమాల వరకూ ఉన్నాయి. సో.. కథానాయికగా ఫుల్ బిజీ. అయినప్పటికీ ‘తరమణి’ అనే చిత్రంలో అతిథి పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ పాత్ర తెరపై కనిపించేది కాసేపే అయినా ప్రేక్షకుల మన్ననలు పొందే విధంగా ఉంటుందట. అందుకే, అంజలి ఈ పాత్ర అంగీకరించారట. కాగా, తమిళంలో కో, సింగమ్ 2 చిత్రాల్లో అతిథి పాత్రలు చేశారు అంజలి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి చేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement