నా కోపాన్ని అక్కడ కక్కేస్తా! | Anger Gym Center says Samantha | Sakshi
Sakshi News home page

నా కోపాన్ని అక్కడ కక్కేస్తా!

Apr 24 2016 3:29 PM | Updated on Sep 3 2017 10:35 PM

నా కోపాన్ని అక్కడ కక్కేస్తా!

నా కోపాన్ని అక్కడ కక్కేస్తా!

కోపం వస్తే మీద పడి కరిచినంత పని చేస్తారు కొంతమంది. కొట్టేంత పని చేస్తారు ఇంకొంత మంది.

 కోపం వస్తే మీద పడి కరిచినంత పని చేస్తారు కొంతమంది. కొట్టేంత పని చేస్తారు ఇంకొంత మంది. మరి కొంతమంది సెలైంట్‌గా ఉండిపోతారు. మరి.. సమంత ఏం చేస్తారో తెలుసా? జిమ్ చేస్తారు. ‘‘ఔను.. నా కోపాన్ని జిమ్ సెంటర్‌లో కక్కేస్తా. మామూలుగా నాకు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ ఎక్కువ. క్రమం తప్పకుండా వర్కవుట్స్ చేస్తా.
 
 కాకపోతే కోపంగా ఉన్నప్పుడు ఎక్కువ చేస్తా. ఆ తర్వాత శాంతిస్తా’’ అని నవ్వుతూ అన్నారు సమంత. తెలుగు, తమిళ భాషల్లో నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారామె. ఆ విషయం గురించి సమంత చెబుతూ - ‘‘ఈ మధ్య నాన్‌స్టాప్‌గా షూటింగ్స్ చేస్తున్నా. అయినప్పటికీ వర్కవుట్స్‌ని దాదాపు మిస్ కాను. ఆడవాళ్లు ఇలాంటి వర్కవుట్సే చేయాలనే నియమం పెట్టుకోను. ఎంత కష్టమైనవాటినైనా చేసి, అమ్మాయిని అయినప్పటికీ స్ట్రాంగే అని నిరూపించుకోవాలన్నది నా ఆశయం’’ అన్నారు.
 
  ఇప్పుడు స్టార్ హీరోయిన్ హోదాలో ఉన్నారు కదా.. నంబర్ గేమ్‌ని నమ్ముతారా? అనే ప్రశ్నను సమంత ముందుంచితే - ‘‘నేను నమ్మను. కానీ, నేను చేసే సినిమాల జయాపజయాలను మాత్రం సీరియస్‌గా తీసుకుంటా. సినిమాలో ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకుంటా. నా నటనలో ఏమైనా లోపాలున్నాయేమో అని ఎనలైజ్ చేసుకుంటా’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement