సినిమాయే దైవం.. బలం.. బాధ్యత | Angel Movie Producer Krishna Reddy Interview | Sakshi
Sakshi News home page

సినిమాయే దైవం.. బలం.. బాధ్యత

Oct 30 2017 12:39 AM | Updated on Oct 30 2017 12:39 AM

Angel Movie Producer Krishna Reddy Interview

‘‘ఇటీవల యూనిట్‌ అంతా ‘ఏంజెల్‌’ సినిమా చూశాం. చాలా బాగుంది. సంతోషంగా అనిపించింది. ఆఫ్‌ స్క్రీన్‌ చేసి వర్క్‌ని స్క్రీన్‌పైన చూస్తే వచ్చే ఆనందమే వేరుగా ఉంటుంది. దాన్నే ప్యాషన్‌ అంటారు’’ అని నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి అన్నారు. నాగ అన్వేష్, హెబ్బా పటేల్‌ జంటగా రాజమౌళి శిష్యుడు ‘బాహుబలి’ పళని దర్శకత్వంలో శ్రీ సరస్వతి ఫిలిమ్స్‌ పతాకంపై రూపొందిన ‘ఏంజెల్‌’ నవంబర్‌ 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘ నాకు సినిమానే దైవం, బలం, బాధ్యత.

‘ఏంజెల్‌’ సినిమా బావుందంటూ సెన్సార్‌ సభ్యులు అభినందించడం సంతోషంగా ఉంది. నాగ అన్వేష్‌ డ్యాన్సులు, ఫైట్స్, స్క్రీన్‌ ప్రెజన్స్‌ చూసి, త్వరలోనే తెలుగులో టాప్‌ స్టార్స్‌లో ఒకడు అవుతాడనిపించింది. ‘ఏంజెల్‌’ సినిమా బిజినెస్‌ చూసిన తర్వాత నిర్మాతగా నమ్మకం కలిగింది. తెలుగులో నవంబర్‌ 3న రిలీజ్‌ చేస్తాం. తమిళ, కన్నడ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వారం లేదా రెండు వారాల గ్యాప్‌తో అక్కడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement