బాలీవుడ్‌కి ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌

Anees Bazmee to direct the Hindi remake of F2 Fun and Frustration - Sakshi

ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘దిల్‌’ రాజు ఇప్పుడు హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. వెంకటేశ్, వరుణ్‌ తేజ్, తమన్నా, మెహరీన్‌ హీరో హీరోయిన్లుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మించిన ‘ఎఫ్‌ 2’ (ఫన్‌ అండ్‌ ప్రస్ట్రేషన్‌) ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వంద కోట్లు వసూలు చేసిన ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌తో కలిసి హిందీలో రీమేక్‌ చేయనున్నారు   ‘దిల్‌’ రాజు. తెలుగులో విజయవంతమైన ‘రెడీ’ చిత్రాన్ని సల్మాన్‌ఖాన్, ఆసిన్‌ జంటగా అదే పేరుతో, ‘పెళ్లాం ఊరెళితే’ చిత్రాన్ని ‘నో ఎంట్రీ’ గా హిందీలో తెరకెక్కించి, విజయం సాధించిన అనీస్‌ బజ్మీ ‘ఎఫ్‌ 2’కి దర్శకత్వం వహిస్తారు. నటీనటుల వివరాలు త్వరలో ప్రకటిస్తారు.
∙‘దిల్‌’ రాజు
∙బోనీకపూర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top