సెట్స్ మీదకు 'ఆంకేన్ 2' | anees bajmi planing for ankhen 2 | Sakshi
Sakshi News home page

సెట్స్ మీదకు 'ఆంకేన్ 2'

Sep 10 2015 12:07 PM | Updated on May 28 2018 4:05 PM

వెల్ కం బ్యాక్ సినిమా సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న దర్శకుడు అనీష్ బజ్మీ మరో ఆసక్తికరమైన సినిమా ఎనౌన్స్ చేశాడు. పదేళ్ల క్రితం రిలీజ్ అయిన ఓ థ్రిల్లర్ క్రైమా డ్రామాకు సీక్వల్ రూపొందిచే పనిలోఉన్నాడు దర్శకుడు...

వెల్ కం బ్యాక్ సినిమా సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న దర్శకుడు అనీష్ బజ్మీ మరో ఆసక్తికరమైన సినిమా ఎనౌన్స్ చేశాడు. పదేళ్ల క్రితం రిలీజ్ అయిన ఓ థ్రిల్లర్ క్రైమా డ్రామాకు సీక్వల్ రూపొందిచే పనిలోఉన్నాడు దర్శకుడు. అప్పట్లో బాలీవుడ్ టాప్ స్టార్స్ నటించిన ఈ సినిమాను మరోసారి అదే స్ధాయిలో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు అనీష్ బజ్మీ.

'ఆంకేన్'.. 2002 లో రిలీజ్ అయిన ఈ థ్రిల్లర్ మూవీ అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. ముగ్గురు గుడ్డి వాళ్లు ఒక బ్యాంక్ దొంగతనం చేయటం అన్న కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కింది. ఫ్యామిలీ లవ్ ఎంటర్ టైనర్ లు మాత్రమే వస్తున్న ఆ సమయంలో ఆడియన్స్ కు ఆంకేన్ ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది. ముఖ్యంగా అంధులుగా అక్షయ్ కుమార్, అర్జున్ రామ్ పాల్, పరేష్ రావల్ ల నటన సూపర్బ్. ఇక వాళ్లను ట్రైన్ చేసి దొంగతనం చేయించే గైడ్ పాత్రం అమితాబ్ తన మార్క్ చూపించాడు.

ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా నటీనటుల ఎంపిక జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న స్టార్ ఇమేజ్ కారణంగా అక్షయ్, అర్జున్ రామ్పాల్ లు ఈ సినిమాలో నటించే అవకాశం కనిపించటం లేదు.. దీంతో యువ కథానాయకలను ఎంపిక చేయాలని భావిస్తున్నారట.. అమితాబ్ పాత్రను మాత్రం మరోసారి బిగ్ బి తోనే చేయించాలని ప్రయత్నిస్తున్నాడు దర్శకుడు అనీష్ బజ్మీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement