అమ్మమ్మగారింటికి వేసవిలోనే... | Ammamma Garillu audio rights for Aditya Music | Sakshi
Sakshi News home page

అమ్మమ్మగారింటికి వేసవిలోనే...

Apr 19 2018 12:43 AM | Updated on Apr 19 2018 12:43 AM

Ammamma Garillu audio rights for Aditya Music - Sakshi

నాగశౌర్య

నాగశౌర్య, బేబి షామిలి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. సుందర్‌ సూర్య దర్శకత్వంలో స్వాజిత్‌ మూవీస్‌ బ్యానర్‌లో రాజేష్, కె.ఆర్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్‌ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘చక్కటి కుటుంబ కథా చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది.

స్వచ్ఛమైన తెలుగు టైటిల్‌ పెట్టడంతో సినిమాకు మంచి క్రేజ్‌ వస్తోంది. ఇటీవలే సినిమా శాటిలైట్‌ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. తాజాగా ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్‌ సొంతం చేసుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత  పెరుగుతున్నాయి. ఈ నెల 22న టీజర్‌ను రిలీజ్‌ చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. వేసవి కానుకగా సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ:  స్వప్న.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement