వాళ్లను చూస్తే గర్వంగా ఉంది!

Amitabh Bachchan Poem On Daughter Shweta Nanda - Sakshi

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు.. తన కూతురు శ్వేతా నందా అంటే వల్లమాలిన ప్రేమ. ఎన్నో కార్యక్రమాల్లో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు కూడా. ఆ మధ్య శ్వేతతో కలిసి ఓ ప్రకటనలో నటించిన సమయంలోనూ... ‘కుమార్తెలు ఉండటం మంచి విషయం. కూతుళ్లే బెస్ట్‌’  అంటూ ట్వీట్‌ చేశారు. కాగా శ్వేతా నందా.. తన స్నేహితురాలు మోనీషా జైసింగ్‌తో కలిసి ఫ్యాషన్‌ బ్రాండ్‌ను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కూతురితో కలిసి.. ప్రచార కార్యక్రమాల కోసం ఫొటోషూట్‌ చేస్తున్నారు. కూతురిని ప్రోత్సహించేందుకు బిగ్‌ బీ.. కూతురు శ్వేతా నందా, మనవరాలు నవ్య నవేలీలను ప్రశంసిస్తూ కవిత రాశారు.

వారిని చూస్తే గర్వంగా ఉంది..
నా కూతుళ్లను చూస్తే గర్వంగా ఉంది. వారు ఎంచుకున్న మార్గాల్లో విజయం సాధించేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. హారంలో పొదగబడిన ముత్యాల్లాంటి వారు. అటువంటి విలువైన వ్యక్తులను సురక్షితంగా చూసుకోవాలి’  అంటూ అమితాబ్‌ బచ్చన్ ట్విటర్‌లో తన కవితను పోస్ట్‌ చేశారు. బిగ్‌ బీ కవితకు ఫిదా అయిన నెటిజన్లు వహ్వా అమితాబ్‌ జీ అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top