అభిషేక్‌.. గ‌ట్టి హ‌గ్ ఇవ్వాల‌నుంది | Amit Sadh: Want To Give Tight Hug To Abhishek Bachchan | Sakshi
Sakshi News home page

అభిషేక్‌.. గ‌ట్టి హ‌గ్ ఇవ్వాల‌నుంది

Jul 21 2020 12:07 PM | Updated on Jul 21 2020 2:10 PM

Amit Sadh: Want To Give Tight Hug To Abhishek Bachchan - Sakshi

క్వారంటైన్‌లో ఉంచినా స‌రే, కానీ గ‌ట్టి హ‌గ్ ఇవ్వాల‌నుంది...

బాలీవుడ్ హీరో అభిషేక్ బ‌చ్చ‌న్‌తో పాటు ఆయ‌న తండ్రి అమితాబ్ బ‌చ్చ‌న్, భార్య ఐశ్వ‌ర్యారాయ్‌, కూతురు ఆరాధ్య‌ క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. వీరు త్వ‌ర‌గా కోలుకోవాలంటూ "బ్రీత్" న‌టుడు అమిత్ సాధ్ ఆకాంక్షించారు. ఈమేర‌కు సోమ‌వారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. "అన్న‌య్య(అబిషేక్‌)‌.. మిమ్మ‌ల్ని గురు, యువ‌, బంటీ, బ‌బ్లీ.. ఇలా ఎన్నో సినిమాల నుంచి ద‌గ్గ‌రగా చూస్తున్నాను.  ముందుగా నాకు సీనియ‌ర్‌గా ఉన్నందుకు కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకుంటున్నాను. న‌న్ను మీతో స‌మానంగా చూశారు. మీరు ఎక్కువ, నేను త‌క్కువ అనే భావ‌న నాకు రాకుండా చేశారు. మీరు లేక‌పోయుంటే బ్రీత్‌లో నా పాత్ర క‌బీర్ సావంత్ అసంపూర్తిగా మిగిలిపోయేది. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించ‌కుండా బ్రీత్ విజ‌య వేడుకకు ఆరంభం, ముగింపు ఏదీ ఉండ‌దు. న‌న్ను ఎప్పుడూ ప్రేరేపిస్తూ ఉండే మీతో క‌లిసి ప‌నిచేసేందుకు నేను ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను". (ర‌ణ్‌బీర్ జిరాక్స్ ఇక లేరు)

మీరు, మీ కుటుంబం ఎంతో త్వ‌ర‌గా క‌రోనాను జ‌యించాల‌ని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. అప్పుడు ఎంచ‌క్కా మిమ్మ‌ల్ని క‌లుసుకోవ‌చ్చు, మీకు గ‌ట్టిగా ఒక హ‌గ్ కూడా ఇవ్వొ‌చ్చు. అలా ఐతే న‌న్ను 2 వారాలు క్వారంటైన్‌లో ఉండ‌మంటారేమో? రెండు వారాలేంటి, నెల రోజులైనా ఉంటాను. అంత ప్రేమ నాకు మీమీద‌! మిమ్మ‌ల్ని చూసే క్ష‌ణం కోసం ఎదురు చూస్తూ ఉంటా" అని రాసుకొచ్చారు. కాగా అభిషేక్ బ‌చ్చ‌న్ తొలిసారిగా న‌టించిన వెబ్ సిరీస్ "బ్రీత్‌: ఇన్‌టూ ది షాడోస్‌". ఇందులో న‌టుడు అమీర్ సాధి క‌బీర్‌గా, అభిషేక్ అవినాష్‌గా న‌టించారు. (‘బిగ్‌బి, అభిషేక్‌లకు చికిత్స అవసరం లేదు’)

Advertisement
 
Advertisement
Advertisement