ఆ సీక్వల్లో నటించటం లేదు | Ameer khan Clarification on lagaan sequal | Sakshi
Sakshi News home page

ఆ సీక్వల్లో నటించటం లేదు

Oct 25 2015 1:26 PM | Updated on Sep 3 2017 11:28 AM

ఆ సీక్వల్లో నటించటం లేదు

ఆ సీక్వల్లో నటించటం లేదు

అమీర్ ఖాన్ కెరీర్లోనే కాదు ఇండియన్ సినిమా హిస్టరీలోనే సెన్సేషనల్ సినిమా లగాన్. కమర్షియల్ సినిమా రాజ్యమేలుతున్న సమయంలో అమీర్ లాంటి స్టార్ హీరో స్వాతంత్ర్య...

అమీర్ ఖాన్ కెరీర్లోనే కాదు ఇండియన్ సినిమా హిస్టరీలోనే సెన్సేషనల్ సినిమా లగాన్. కమర్షియల్ సినిమా రాజ్యమేలుతున్న సమయంలో అమీర్ లాంటి స్టార్ హీరో స్వాతంత్ర్య సమరం నేపధ్యంతో తెరకెక్కించిన పీరియాడిక్ ఎమోషనల్ డ్రామా లగాన్. ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా, తరువాత కమర్షియల్ గానూ ఘనవిజయం సాదించి, అస్కార్ రేసులో పోటి పండింది.

ఇంతటి ఘనవిజయం సాధించిన లగాన్కు సీక్వల్ రూపొందించాలన్న ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. లగాన్ స్థాయి కథ కోసం ఇంతకాలం ఎదురుచూసిన దర్శకుడు అశుతోష్ గోవారికర్ ఫైనల్గా ఈ సినిమా సీక్వల్ను సెట్స్ మీదకు తీసుకెళ్లాడానికి రెడీ అవుతున్నాడు. అయితే లగాన్ తొలి భాగంలో నటించిన నటీనటులు సీక్వల్లో నటించే అవకాశాలు మాత్రం కనిపించటం లేదు.

లగాన్ సక్సెస్లో కీ రోల్ ప్లే చేసిన హీరో అమీర్ ఖాన్ సీక్వల్లోనటించటం లేదని ప్రకటించేశాడు. ప్రస్తుతం దంగల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న అమీర్ లగాన్ సీక్వల్లో నటించడానికి ఇంట్రస్ట్ చూపించటం లేదు. హీరోయిన్గా మాత్రం బాలీవుడ్ నటి ప్రాచీ దేశాయ్ని ఫైనల్ చేశారు చిత్రయూనిట్. సినీ చరిత్రను మలుపు తిప్పిన లగాన్ సీక్వల్ హీరోగా ఎవరు నటిస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement