బ్రూస్ లీకి బన్నీ సపోర్ట్
కొద్ది రోజులుగా 'బ్రూస్ లీ' సినిమా విడుదలను వాయిదా వేయాలంటూ వస్తున్న వార్తలపై అల్లు అర్జున్ స్పందించాడు. 'బ్రూస్ లీ' చిత్రయూనిట్ తన రిలీజ్ డేట్ వాయిదా వేసుకోకపోవటంపై వారిని నిందించడం సరికాదన్నాడు బన్నీ.
	కొద్ది రోజులుగా 'బ్రూస్ లీ' సినిమా విడుదల వాయిదా వేయాలంటూ వస్తున్న కథనాలపై అల్లు అర్జున్ స్పందించాడు. 'బ్రూస్ లీ' చిత్ర యూనిట్ తన రిలీజ్ డేట్ వాయిదా వేసుకోకపోవటంపై వారిని నిందించడం సరికాదన్నాడు బన్నీ. 'బ్రూస్ లీ టీం సినిమా మొదలైన సమయంలోనే విడుదల తేదీని ప్రకటించారు. ఆ సమయంలో రుద్రమదేవి సినిమా సెప్టెంబర్ 4న విడుదల అవుతుందని భావించారు. అనేక కారణాలతో రుద్రమదేవి వాయిదా పడుతూ అక్టోబర్ 9న విడుదలైంది. బ్రూస్ లీ 16న విడుదల అవుతుందన్న విషయం తెలిసే రుద్రమదేవి యూనిట్ తమ సినిమాను 9న రిలీజ్ చేశారు. పండగ సీజన్ కావటంతో రెండు సినిమాలకు స్కోప్ ఉంటుందన్న భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారు' అని క్లారిటీ ఇచ్చాడు అల్లు అర్జున్.
	
	రుద్రమదేవి సినిమా తరువాత పెద్ద సినిమాలు విడుదల కావటం మంచి కాదని సోమవారం జరిగిన సక్సెస్ మీట్ లో సీనియర్ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు కామెంట్ చేయగా, అదే రోజు అల్లు అర్జున్ ట్విట్టర్లో ఈ విషయంపై అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు.
	
		My view about BRUCELEE release clash with RUDHRAMADEVI pic.twitter.com/qK2yjek3i2
	— Allu Arjun (@alluarjun) October 12, 2015
					
					
					
					
						
					          			
						
				
 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
