బన్నీకి జోడి సమంత..!

Allu Arjun And Samantha Team Up For Vikram Kumar Film - Sakshi

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో నిరాశపరిచిన స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. ఆ సినిమా తరువాత గ్యాప్‌ తీసుకుంటున్నాడు. నా పేరు సూర్య రిలీజ్‌ అయి 4 నెలలు దాటుతున్న  బన్నీ కొత్త సినిమాను ఇంకా మొదలు పెట్టలేదు. చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినా ఇంకా ఎవరికీ బన్నీ ఓకె చెప్పలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో నటించేందుకు బన్నీ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట.

ఇప్పటికే విక్రమ్‌ కథకు బన్నీ ఓకె చెప్పాడన్న టాక్‌ వినిపిస్తోంది.  అంతేకాదు ఈ సినిమాకు నటీనటుల  ఎంపిక కూడా జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో బన్నీకి జోడిగా సమంతను తీసుకునే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు విక్రమ్‌ కుమార్‌. గతంలో బన్నీకి జోడిగా సమంత నటించిన సన్నాఫ్ సత్యమూర్తి మంచి విజయం సాధించింది. విక్రమ్‌ కాంబినేషన్‌లో సమంత నటించిన 24 కూడా మంచి విజయం సాధించింది. దీంతో సెంటిమెంట్ పరంగా కూడా సమంత అయితే కలిసొస్తుందని భావిస్తున్నారట చిత్రయూనిట్. అయితే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top