అల్లరోడు ఏమైపోయాడు..? | allari naresh next movie details | Sakshi
Sakshi News home page

అల్లరోడు ఏమైపోయాడు..?

Sep 12 2015 10:32 AM | Updated on Sep 3 2017 9:16 AM

గ్యాప్ లేకుండా సినిమా వెంట సినిమా చేస్తూ థియేటర్లలో సందడి చేసే అల్లరి నరేష్, ఈ మధ్య స్పీడు తగ్గించాడు. యంగ్ హీరోలలో అందరికంటే వేగంగా సినిమాలు చేస్తున్న ఈ కామెడీ హీరో, ఈ మధ్య ఆ జోరు చూపించటం లేదు. 2012లో...

గ్యాప్ లేకుండా  వరుస సినిమాలతో థియేటర్లలో సందడి చేసే అల్లరి నరేష్, ఈ మధ్య స్పీడు తగ్గించాడు. యంగ్ హీరోలలో అందరికంటే వేగంగా సినిమాలు చేస్తున్న ఈ కామెడీ హీరో, ఈ మధ్య ఆ జోరు చూపించటం లేదు. 2012లో రిలీజ్ అయిన 'సుడిగాడు' తరువాత ఇంత వరకు ఒక్క హిట్ కూడా లేకపోవటంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు నరేష్.

ఒకప్పుడు కామెడీ స్టార్గా టాప్ ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లరి నరేష్ తరువాత మూస సినిమాలతో బోర్ కొట్టించాడు. దీంతో సినిమా సక్సెస్ రేట్ బాగా తగ్గిపోయింది. విషయం తెలుసుకున్న నరేష్ కొత్త తరహా చిత్రాలను ప్రయత్నించినా అవి కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. లడ్డూ బాబు, బందిపోటు లాంటి ప్రయోగాలు నిరాశపరిచాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆలోచనలో పడ్డాడు.

ఇటీవల విడుదలైన బందీపోటు సినిమా కూడా అల్లరి నరేష్ కు నెగెటివ్ రిజల్టే ఇచ్చింది. అందుకే ఈసారి సోలోగా కాకుండా ఓ మల్టీ స్టారర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. తన ప్రతీ సినిమాను జెట్ స్పీడ్తో పూర్తి చేసే నరేష్, ఈ సారి మాత్రం స్లో అండ్ స్టడీ సూత్రాన్ని ఫాలో అవుతున్నాడు. మోహన్ బాబుతో కలిసి 'మామ మంచు-అల్లుడు కంచు' సినిమాలో నటిస్తున్న నరేష్ ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement