breaking news
bandhipotu
-
నాగేశ్వరరావు పాత్రలో రానా..?
స్టార్ ఇమేజ్ తో సంబంధం లేకుండా విభిన్న పాత్రల్లో అలరిస్తున్న యంగ్ హీరో రానా జాతీయ నటుడిగా ఎదుగుతున్నాడు. ఇప్పటికే తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో వరుసగా విభిన్నచిత్రాలు చేస్తూ అలరిస్తున్నాడు. ప్రస్తుతం పీరియాడిక్ జానర్ లో తెరకెక్కుతున్న 1945 సినిమాలో నటిస్తున్నాడు రానా. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలీవుడ్ క్లాసిక్ హాథీ మేరి సాథీకి రీమేక్ గా అదే పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. తాజాగా రానా మరో ఆసక్తికరమైన సినిమాకు ఓకే చెప్పాడన్న టాక్ వినిపిస్తోంది. తెలుగు రాబిన్ హుడ్ గా పేరు తెచ్చుకున్న స్టువర్ట్పురం దొంగ టైగర్ నాగేశ్వరరాదవు కథతో సినిమా తెరకెక్కనుందన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఫేం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. బయోపిక్ గా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌లో టైగర్ నాగేశ్వరరావు పాత్రలో రానా నటించనున్నాడట. ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించనున్నాడు. -
అల్లరోడు ఏమైపోయాడు..?
గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో థియేటర్లలో సందడి చేసే అల్లరి నరేష్, ఈ మధ్య స్పీడు తగ్గించాడు. యంగ్ హీరోలలో అందరికంటే వేగంగా సినిమాలు చేస్తున్న ఈ కామెడీ హీరో, ఈ మధ్య ఆ జోరు చూపించటం లేదు. 2012లో రిలీజ్ అయిన 'సుడిగాడు' తరువాత ఇంత వరకు ఒక్క హిట్ కూడా లేకపోవటంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు నరేష్. ఒకప్పుడు కామెడీ స్టార్‌గా టాప్ ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లరి నరేష్ తరువాత మూస సినిమాలతో బోర్ కొట్టించాడు. దీంతో సినిమా సక్సెస్ రేట్ బాగా తగ్గిపోయింది. విషయం తెలుసుకున్న నరేష్ కొత్త తరహా చిత్రాలను ప్రయత్నించినా అవి కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. లడ్డూ బాబు, బందిపోటు లాంటి ప్రయోగాలు నిరాశపరిచాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆలోచనలో పడ్డాడు. ఇటీవల విడుదలైన బందీపోటు సినిమా కూడా అల్లరి నరేష్ కు నెగెటివ్ రిజల్టే ఇచ్చింది. అందుకే ఈసారి సోలోగా కాకుండా ఓ మల్టీ స్టారర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. తన ప్రతీ సినిమాను జెట్ స్పీడ్‌తో పూర్తి చేసే నరేష్, ఈ సారి మాత్రం స్లో అండ్ స్టడీ సూత్రాన్ని ఫాలో అవుతున్నాడు. మోహన్ బాబుతో కలిసి 'మామ మంచు-అల్లుడు కంచు' సినిమాలో నటిస్తున్న నరేష్ ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.