నాగేశ్వరరావు పాత్రలో రానా..?

rana in talks for Tiger Nageshwararao biopic - Sakshi

స్టార్ ఇమేజ్ తో సంబంధం లేకుండా విభిన్న పాత్రల్లో అలరిస్తున్న యంగ్ హీరో రానా జాతీయ నటుడిగా ఎదుగుతున్నాడు. ఇప్పటికే తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో వరుసగా విభిన్నచిత్రాలు చేస్తూ అలరిస్తున్నాడు. ప్రస్తుతం పీరియాడిక్ జానర్ లో తెరకెక్కుతున్న 1945 సినిమాలో నటిస్తున్నాడు రానా.

ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలీవుడ్ క్లాసిక్ హాథీ మేరి సాథీకి రీమేక్ గా అదే పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. తాజాగా రానా మరో ఆసక్తికరమైన సినిమాకు ఓకే చెప్పాడన్న టాక్ వినిపిస్తోంది. 

తెలుగు రాబిన్ హుడ్ గా పేరు తెచ్చుకున్న స్టువర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వరరాదవు కథతో సినిమా తెరకెక్కనుందన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఫేం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. బయోపిక్ గా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌లో టైగర్ నాగేశ్వరరావు పాత్రలో రానా నటించనున్నాడట. ఈ సినిమాను ఏకె ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించనున్నాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top