ఆమెకు క్షమాపణ చెప్పేందుకు సిద్ధం : అలియా భట్‌

Alia Bhatt Says She Is Ready To Apologise Kangana Ranaut Over Manikarnika Promotion - Sakshi

ముంబై : బాలీవుడ్‌ మొత్తం గ్యాంగ్‌లా ఏర్పడి తనకు వ్యతిరేకంగా మారారంటూ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ విమర్శించారు. ప్రణాళిక ప్రకారమే తన ‘మణికర్ణిక’ సినిమాకు మద్దతుగా నిలవలేందంటూ ‘క్వీన్‌’ చిందులు తొక్కారు. నెపోటిజమ్‌కు వ్యతిరేకంగా తాను మాట్లాడినందు వల్లే ఇలా కక్ష గట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో అలియా భట్‌, ఆమిర్‌ ఖాన్‌ల పేర్లు ప్రస్తావించిన కంగనా.. ‘అలియా భట్‌ నాకు ‘రాజీ’ ట్రైలర్‌ పంపించారు. తనకు సపోర్ట్‌ చేయమన్నారు. అలాగే ఆమిర్‌ కూడా ‘దంగల్‌’ మూవీ ప్రమోషన్‌లో పాల్గొనమన్నారు. ఈ రెండు సినిమాలు సందేశాత్మకమైనవి గనుక వాటికి అండగా నిలిచాను. ప్రస్తుతం నేను ధీర వనిత లక్ష్మీబాయి కథతో ముందుకు వస్తే నాకు ఎవరూ సహకరించడం లేదు’ అంటూ గురువారం ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో కంగనా వ్యాఖ్యలపై స్పందించిన అలియా భట్‌ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ‘ తను(కంగన) నన్ను ద్వేషిస్తున్నారని అనుకోవడం లేదు. తనను కావాలని అప్‌సెట్‌ చేయలేదు. కాస్త బిజీగా ఉన్నందు వల్లే ఇలా జరిగింది. ఈ విషయమై తనకు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను. తనలా మాట్లాడటానికి చాలా ధైర్యం కావాలి. ఒక వ్యక్తిగా, గొప్ప నటిగా తన పట్ల నాకు ఆరాధనా భావం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా ప్రస్తుతం రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి నటించిన గల్లీ బాయ్‌ సినిమా ప్రమోషన్లతో అలియా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top