ఎ పోయి ఎ వచ్చె! | Akshay Kumar replaces Ajay Devgn in 'Indian 2'? | Sakshi
Sakshi News home page

ఎ పోయి ఎ వచ్చె!

Nov 20 2018 3:49 AM | Updated on Aug 8 2019 11:13 AM

Akshay Kumar replaces Ajay Devgn in 'Indian 2'? - Sakshi

అక్షయ్‌ కుమార్‌

ఎ.. అంటే అజయ్‌ దేవగన్‌.. ఎ.. అంటే అక్షయ్‌ కుమార్‌. ‘ఇండియన్‌ 2’కి ఇప్పుడు ఓ ‘ఎ’ పోయి మరో ‘ఎ’ వచ్చిందట. కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘ఇండియన్‌’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా ఎంత బంపర్‌ హిట్‌ అయ్యిందో తెలిసిందే. కమల్‌–శంకర్‌ కాంబినేషన్‌లోనే ‘ఇండియన్‌’కి సీక్వెల్‌గా ‘ఇండియన్‌ 2’ తెరకెక్కనుంది. ఇటీవల ఈ సినిమా సెట్‌ వర్క్‌ కూడా స్టార్ట్‌ అయింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో విలన్‌ పాత్రకు బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌ని తీసుకున్నారంటూ కోలీవుడ్‌లో వార్తలొచ్చాయి.

తాజాగా అజయ్‌ స్థానంలో అక్షయ్‌ కుమార్‌ని ఓకే చేశారంటున్నాయి కోడంబాక్కమ్‌ వర్గాలు. రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘2.0’లో విలన్‌గా నటించారు అక్షయ్‌ కుమార్‌. ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ చిత్రం షూటింగ్‌లో అక్షయ్‌–శంకర్‌ మధ్య మంచి బాండింగ్‌ కుదిరిందట. అందుకే మళ్లీ కలిసి పనిచేయనున్నారని టాక్‌. కమల్‌కి జోడీగా కాజల్‌ అగర్వాల్‌ ఎంపికయ్యారట. అలాగే దుల్కర్‌ సల్మాన్, శింబు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement