అజిత్‌కు అది సెంటిమెంటా..? | ajith in vivegam movie | Sakshi
Sakshi News home page

అజిత్‌కు అది సెంటిమెంటా..?

Jun 10 2017 12:35 PM | Updated on Aug 9 2018 7:28 PM

అజిత్‌కు అది సెంటిమెంటా..? - Sakshi

అజిత్‌కు అది సెంటిమెంటా..?

సెంటిమెంట్‌కు చాలా మంది ప్రాధాన్యతనిస్తుంటారు.

సెంటిమెంట్‌కు చాలా మంది ప్రాధాన్యతనిస్తుంటారు. అయితే అది సినిమా విషయంలో కాస్త ఎక్కువనే చెప్పాలి. ఒక చిత్రం హిట్‌ అయితే అందుకు కారణమైన విషయాన్ని సెంటిమెంట్‌గా తరువాత కూడా ఫాలో అవుతుంటారు. అలాఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్‌ ఉంటుంది. అలా నటుడు అజిత్‌కు ఒక సెంటిమెంట్‌ ఉందా? అంటే లేకపోలేదంటున్నారు కోలీవుడ్‌ వర్గాలు. ఒక సమయంలో అజిత్‌ అపజయాలనే పడవలో ఆటుపోటులకు గురైనా ఇటీవల వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్నారు.

సమీపకాలంలో చూసుకుంటే వీరమ్, వేదాళం చిత్రాలు వరుసగా అజిత్‌ విజయాల గ్రాస్‌ పెంచాయనే చెప్పాలి. వీరమ్‌ చిత్రం జనవరి 10న విడుదల కాగా, వేదాళం నవంబర్‌ 10న విడుదలైంది. తాజాగా నటిస్తున్న చిత్రం వివేగం. కాజల్‌అగర్వాల్‌ నాయకిగా నటిస్తున్న ఇందులో కమలహాసన్‌ రెండో కూతురు అక్షరహాసన్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 10న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం.

మరో విషయం ఏమిటంటే ఈ మూడు చిత్రాల మొదటి అక్షరం ‘వి’ తో మొదలవుతోంది. ఈ మూడు చిత్రాలకు దర్శకుడు శివ కావడం విశేషం. ఇలా అజిత్‌ నటిస్తున్న చిత్రాలు వరుసగా 10వ తేదీన తెరపైకి రావడం, వి అక్షరాలతో చిత్ర పేర్లు నిర్ణయించడం అన్నది కాకతీళీయమా? లేక సెంటిమెంట్‌గా భావించి ఆ తేదీల్లో విడుదలకు ప్లాన్‌ చేసుకుంటున్నారా? అన్నది ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. కాగా వివేగం చిత్రంపైనా భారీ అంచనాలే నెలకొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement