అజిత్ తాజా చిత్రం సత్య? | Ajith-Gautham Menon film titled Sathya? | Sakshi
Sakshi News home page

అజిత్ తాజా చిత్రం సత్య?

May 8 2014 11:59 PM | Updated on Sep 2 2017 7:05 AM

అజిత్ తాజా చిత్రం సత్య?

అజిత్ తాజా చిత్రం సత్య?

నటుడు అజిత్ తాజా చిత్రానికి సత్య అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు సమాచారం. ఆరంభం, వీరం వంటి వరుస విజయాలతో మంచి జోష్‌లో వున్న అజిత్ హ్యాట్రిక్‌కు సిద్ధం అవుతున్నారు.

నటుడు అజిత్ తాజా చిత్రానికి సత్య అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు సమాచారం. ఆరంభం, వీరం వంటి వరుస విజయాలతో మంచి జోష్‌లో వున్న అజిత్ హ్యాట్రిక్‌కు సిద్ధం అవుతున్నారు. ఈ అల్టిమేట్ స్టార్ తాజాగా నటిస్తున్న చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆరంభం చిత్ర నిర్మాతే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఇందులో అజిత్ సరసన అనుష్క హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరో హీరోయిన్‌గా త్రిష పేరు ప్రచారంలో ఉంది. ఈ చిత్రానికి పలు పేర్లను పరిశీలించిన చిత్ర యూనిట్ చివరికి సత్య అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం.
 
 ఇదే పేరుతో ఇంతకుముందు కమలహాసన్ నటించారన్నది గమనార్హం. ఇప్పుడు అజిత్ సత్యగా రాబోతున్నారన్నమాట. సెలైంట్‌గా శరవేగంతో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పూర్తి మాస్ ఎంటర్‌టైనర్ అని తెలిసింది. చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు దుమ్ము రేపుతాయంటున్నారు. అలాగే యువతను గిలిగింతలు పెట్టించే డీప్ లవ్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని సమాచారం. సత్య చిత్రం కోసం హరీష్ జయరాజ్ సంగీతబాణీలు కడుతున్నారు. చాలా గ్యాప్ తరువాత గౌతమ్‌మీనన్, హరీష్ జయరాజ్ కలసి పని చేస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.
 

Advertisement
 
Advertisement
Advertisement