అతనేంటో నాకు తెలుసు | Aishwarya Dhanush opens up about gossips on Dhanush | Sakshi
Sakshi News home page

అతనేంటో నాకు తెలుసు

Oct 23 2016 2:48 AM | Updated on Sep 4 2017 6:00 PM

అతనేంటో నాకు తెలుసు

అతనేంటో నాకు తెలుసు

నా భర్త ఎలాంటి వారో నాకు బాగా తెలుసని సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు, దర్శకురాలు ఐశ్వర్య ధనుష్ పేర్కొన్నారు.

 నా భర్త ఎలాంటి వారో నాకు బాగా తెలుసని సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు, దర్శకురాలు ఐశ్వర్య ధనుష్ పేర్కొన్నారు. 3 చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమైన ఈమె ఆ తరువాత వైరాజావై చిత్రం చేశారు. ప్రస్తుతం స్టంట్ కళాకారుల జీవిత ఇతివృత్తంతో సినిమా వీరన్ అనే లఘు చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అదే విధంగా తన తండ్రి సూపర్‌స్టార్ జీవిత చరిత్రను రాసి, దాన్ని వెండి తెరపై ఆవిష్కరించే పనిలోనూ ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఐశ్వర్య భర్త, ధనుష్ గురించి రకరకాల వదంతులు మీడి యాలో హల్‌చల్ చేస్తున్నాయి. ధనుష్ ప్లేబాయ్ అని, కొందరు నటీమణులతో చెట్టాపట్టాల్ అంటూ వదంతులు కలకలం పుట్టిస్తున్నాయి.
 
  అంతే కాదు ఇలాంటి వదంతుల కారణంగా కుటుంబంలో సమస్యలు తలెత్తినట్లు, చివరకు రజనీకాంత్ కలగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దినట్లు కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇలాంటి ప్రచారాన్ని మౌనంగా గమనిస్తూ వస్తున్న ధనుష్ భార్య, దర్శకురాలు ఐశ్వర్య ధనుష్ తన మనోగతాన్ని తేటతెల్లం చేశారు. తన భర్తపై ప్రచారం అవుతున్న వదంతులకు స్పందిస్తూ తాను డాక్టర్‌నో, లాయర్‌నో అయి ఉంటే ఇలాంటి వదంతులకు ఆగ్రహించుకునేదానినన్నారు.
 
  తనది సినిమా కుటుంబం అని, సినిమా గురించి తనకు పూర్తిగా తెలుసనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన భర్త ధనుష్ గురించి,ఆయన ఎలాంటి వారో తనకు బాగా తెలసన్నారు. ఇలాంటి పనికిమాలిన, అసత్య ప్రచారాల గురించి పట్టించుకోవలసిన అవసరమో, బాధ పడాల్సిన పనో లేదని ఐశ్వర్య ధనుష్ స్పష్టం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న కథనం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement