అచ్చతెనుగు ‘అడవి కాచిన వెన్నెల’ | Adavi Kachina Vennela Movie Digital Poster Launched | Sakshi
Sakshi News home page

అచ్చతెనుగు ‘అడవి కాచిన వెన్నెల’

Dec 2 2013 1:06 AM | Updated on Sep 2 2017 1:10 AM

అచ్చతెనుగు ‘అడవి కాచిన వెన్నెల’

అచ్చతెనుగు ‘అడవి కాచిన వెన్నెల’

అరవింద్కృష్ణ, మీనాక్షి దీక్షిత్, పూజా రామచంద్రన్ ముఖ్య తారలుగా స్వీయదర్శకత్వంలో అక్కి విశ్వనాధరెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘అడవి కాచిన వెన్నెల’.

అరవింద్కృష్ణ, మీనాక్షి దీక్షిత్, పూజా రామచంద్రన్ ముఖ్య తారలుగా స్వీయదర్శకత్వంలో అక్కి విశ్వనాధరెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘అడవి కాచిన వెన్నెల’. ఆదివారం ఈ చిత్రం ప్రచార చిత్రాలను ఎ.రమేష్ప్రసాద్ ఆవిష్కరించి, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందజేశారు. విశ్వనాధరెడ్డి మాట్లాడుతూ - ‘‘టైటిల్ వినగానే ఇది అదో తరహా సినిమా అనుకునే అవకాశం ఉంది. కానీ, ఇది నెగటివ్ సినిమా కాదు.  పాజిటివ్గా సాగడంతో పాటు క్లయిమాక్స్ కూడా పాజిటివ్గా ఉంటుంది. కొత్త కథ, కథనంతో రూపొందిస్తున్నాం. జనవరిలో సినిమాని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. హాలీవుడ్ చిత్రంలో నటించినట్లపించిందని మీనాక్షి అన్నారు. హౌస్వైఫ్గా నటించానని పూజా చెప్పారు. అరవింద్కృష్ణ చెబుతూ-‘‘దర్శకుడు చెప్పిన కథ అద్భుతం అనిపించింది. ఇందులో గొప్ప డైలాగులున్నాయి. అచ్చ తెలుగు టైటిల్తో రూపొందిన అసలు సిసలైన తెలుగు సినిమా ఇది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ రోడ్రిగ్యుజ్, డా. జోశ్యభట్ల, పాటలు: సిరివెన్నెల.
 

Advertisement
 
Advertisement
Advertisement