హాలీవుడ్ తరహాలో... | Adavi Kachina Vennela a thriller Movie | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ తరహాలో...

May 26 2014 12:41 AM | Updated on Sep 2 2017 7:50 AM

హాలీవుడ్ తరహాలో...

హాలీవుడ్ తరహాలో...

అరవింద్‌కృష్ణ, మీనాక్షి దీక్షిత్, పూజా రామచంద్రన్, బేబి అక్కి ముఖ్య తారలుగా మూన్‌లైట్ డ్రీమ్స్ పతాకంపై స్వీయదర్శకత్వంలో అక్కి విశ్వనాథరెడ్డి రూపొందించిన చిత్రం

అరవింద్‌కృష్ణ, మీనాక్షి దీక్షిత్, పూజా రామచంద్రన్, బేబి అక్కి ముఖ్య తారలుగా మూన్‌లైట్ డ్రీమ్స్ పతాకంపై స్వీయదర్శకత్వంలో అక్కి విశ్వనాథరెడ్డి రూపొందించిన చిత్రం ‘అడవి కాచిన వెన్నెల’. అచ్చ తెలుగు టైటిల్‌తో రూపొందించిన ఈ చిత్రం కొత్త జానర్‌లో ఉంటుందని విశ్వనాథరెడ్డి తెలిపారు. వచ్చే నెల ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత మాట్లాడుతూ- ‘‘కొత్త కథ, కథనంతో రూపొందించిన సినిమా ఇది. ఈ సినిమా టైటిల్ వినగానే అదో తరహా సినిమా అనుకునే అవకాశం ఉంది. కానీ, ఇది పాజిటివ్ సినిమా. క్లయిమాక్స్ కూడా పాజిటివ్‌గానే ఉంటుంది. ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేయాలనే లక్ష్యంతో చేశాం. కథ, కథనం, మాటలు, పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అరవింద్‌కృష్ణ అద్భుతంగా నటించారు. ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే హాలీవుడ్ సినిమాల తరహాలో సాగే అచ్చ తెలుగు సినిమా’’ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement