-
మహర్షి గాళ్‌ఫ్రెండ్
‘నీ దూకుడు.. సాటెవ్వడూ..’ అంటూ ‘దూకుడు’ టైటిల్ సాంగ్‌లో కనిపించిన హీరోయిన్ గుర్తుండే ఉంటారు. తన పేరు మీనాక్షి దీక్షిత్. ‘లైఫ్ స్టైల్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకు పరిచయం అయ్యారు. ‘బాడీగార్డ్, బాద్షా’ వంటి సినిమాల్లో టైటిల్ సాంగ్‌లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారీ బ్యూటీ. లేటెస్ట్గా ‘మహర్షి’ సినిమాలో మహేశ్‌బాబు గాళ్‌ఫ్రెండ్‌గా కనిపిస్తారట. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో న్యూయార్క్‌లో పుట్టి పెరిగిన అమ్మాయి పాత్రలో మీనాక్షి కనిపిస్తారట. ఈ పాత్ర ఫుల్ గ్లామరస్‌గా ఉంటుందట. దాని కోసం మీనాక్షి తన లుక్‌ని టోటల్‌గా మార్చుకున్నారు. ‘‘వంశీగారు నాకోసం ఓ ఆసక్తికరమైన పాత్రను రాశారు. మహేశ్‌బాబుగారికి, నాకు ఉండే కెమిస్ట్రీ సినిమాలో హైలైట్‌గా ఉంటుంది’’ అని తన పాత్ర గురించి పేర్కొన్నారు మీనాక్షి. ‘మహర్షి’ చిత్రం మే 9న విడుదల కానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. తొలి పాటను ఈ 29న విడుదల చేయనున్నారు. -
మనసు దోచే ‘హై లైఫ్’
మాదాపూర్ : నగర యువతను ఆకట్టుకునేలా స్టాల్స్‌ను ఏర్పాటు చేసినట్లు నటిమీనాక్షి దీక్షిత్ చెప్పారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో హైలైఫ్ ఎగ్జిబిషన్‌ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ఎగ్జిబిషన్లో మగువలను విశేషంగా ఆకట్టుకునే కలెక్షన్స్ ఉన్నాయన్నారు. మగువలకు నచ్చే నగలు, డ్రెస్ మెటిరీయల్, చుడీదార్లు, చీరెలు అందుబాటులో ఉన్నాయన్నారు. హై లైఫ్ నిర్వాహకులు డోమినిక్ మాట్లాడుతూ..బెంగుళూరు, అహ్మదాబాద్, కొచ్చిన్, చెన్నై, పూణే, ముంబై, జైపూర్‌లతో పాటు శ్రీలంక తదితర ప్రాంతాలకు చెందిన 250 డిజైనర్స్‌తో కూడిన స్టాల్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎగ్జిబిషన్ ఈ నెల 9 వరకు ఉంటుందన్నారు. -
రమేష్‌తో రొమాన్స్!
హాస్యనటుడు వడి వేలుతో తెనాలి రామన్ చిత్రంలో డ్యూయట్స్ పాడిన నటి మీనాక్షి దీక్షిత్, ఇప్పుడు కోలీవుడ్‌లో అవకాశాలు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్‌లో నటించే లక్కీచాన్స్ కొట్టేసింది. ఆర్బీ చౌదరి నిర్మిస్తున్న, ఇంకా పేరు పెట్టని చిత్రంలో ఆయన తనయుడు జిత్తన్ రమేష్ హీరోగా నటిస్తున్నారు. రమేష్‌కు జంటగా మీనాక్షి దీక్షిత్ నటించనుంది. పూర్తి వినోద భరింతగా, తెరకెక్కనున్న ఈ చిత్రం ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుందని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్రంతో కోలీవుడ్‌లో తనకు మంచి గుర్తింపు వస్తుందన్న ఆశాభావాన్ని మీనాక్షి దీక్షిత్ వ్యక్తం చే స్తోంది. ఈ అమ్మడు ఇప్పటికే మరో హాస్యనటుడు ప్రేమ్‌జీతో కలసి టక్కర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం పూర్తి కావచ్చింది. ఈ రెండు చిత్రాలు విడుదల అనంతరం నటిగా తన స్థాయి పెరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిత్తన్ రమేష్ జిత్తన్ -2 అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం కూడా త్వరలో తెరపైకి రానుంది. కొంత కాలంగా నటనకు దూరంగా ఉన్న జిత్తన్ రమేష్‌కు ఈ చిత్రం విజయం చాలా అవసరం. -
ధగధగలాడే నగలు.. నిగనిగలాడే భామలు
ధగధగలాడే నగలతో నిగనిగలాడే భామలు బంజారాహిల్స్ హోటల్ తాజ్ కృష్ణాలో సందడి చేశారు. జ్యువెల్స్ ఆఫ్ ఏషియా ప్రదర్శన శుక్రవారం ఇక్కడ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సినీ తారలు మీనాక్షి దీక్షిత్, నేహాలుల్లా, మిసెస్ ప్లానెట్ మెహక్ మూర్తి ప్రత్యేకంగా రూపొందించిన నగలు ధరించి వేదికపై కనువిందు చేశారు. ఆభరణాల ప్రదర్శనలో దేశంలోనే అగ్రగామి సంస్థగా గుర్తింపు పొందిన ‘క్రివిష్ విజన్’ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆదివారం వరకు ప్రదర్శన ఉంటుంది. అలాగే ఆర్టీసీ క్రాస్‌రోడ్‌సలో నూతనంగా ఏర్పాటు చేసిన తబలా రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో కూడా మీనాక్షిదీక్షిత్ తళుక్కుమంది. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, నటుడు వెంకట్ తదితరులు పాల్గొన్నారు. - ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
ఊహకందని కోణాలు
అరవింద్ కృష్ణ, మీనాక్షి దీక్షిత్, పూజా రామచంద్రన్ ముఖ్య తారలుగా మూన్లైట్ డ్రీమ్స్ పతాకంపై స్వీయదర్శకత్వంలో అక్కి విశ్వనాథరెడ్డి రూపొందించిన చిత్రం ‘అడవి కాచిన వెన్నెల’. వచ్చే నెల 1న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ -‘‘ఓ భిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఊహకందని కోణాలు ఈ కథలో ఉంటాయి. సిరివెన్నెల సాహిత్యం ఈ చిత్రానికి ప్రధాన బలం. ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేయాలనే లక్ష్యంతో చేశాం. అచ్చ తెలుగు టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం టేకింగ్ మాత్రం హాలీవుడ్ స్టయిల్లో ఉంటుంది. దర్శక, నిర్మాతగా నాకు మాత్రమే కాదు... నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రం అవుతుంది’’ అని చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement