మహర్షి గాళ్‌ఫ్రెండ్‌ | Meenakshi Dixit to star in Mahesh Babu's Maharshi | Sakshi
Sakshi News home page

మహర్షి గాళ్‌ఫ్రెండ్‌

Mar 25 2019 12:06 AM | Updated on Apr 7 2019 12:28 PM

Meenakshi Dixit to star in Mahesh Babu's Maharshi - Sakshi

మీనాక్షి దీక్షిత్‌

‘నీ దూకుడు.. సాటెవ్వడూ..’ అంటూ ‘దూకుడు’ టైటిల్‌ సాంగ్‌లో కనిపించిన హీరోయిన్‌ గుర్తుండే ఉంటారు. తన పేరు మీనాక్షి దీక్షిత్‌. ‘లైఫ్‌ స్టైల్‌’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకు పరిచయం అయ్యారు. ‘బాడీగార్డ్, బాద్‌షా’ వంటి సినిమాల్లో టైటిల్‌ సాంగ్‌లో స్పెషల్‌ అప్పియరెన్స్‌ ఇచ్చారీ బ్యూటీ. లేటెస్ట్‌గా ‘మహర్షి’ సినిమాలో మహేశ్‌బాబు గాళ్‌ఫ్రెండ్‌గా కనిపిస్తారట. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’.

అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో న్యూయార్క్‌లో పుట్టి పెరిగిన అమ్మాయి పాత్రలో మీనాక్షి కనిపిస్తారట. ఈ పాత్ర ఫుల్‌ గ్లామరస్‌గా ఉంటుందట. దాని కోసం మీనాక్షి తన లుక్‌ని టోటల్‌గా మార్చుకున్నారు. ‘‘వంశీగారు నాకోసం ఓ ఆసక్తికరమైన పాత్రను రాశారు. మహేశ్‌బాబుగారికి, నాకు ఉండే కెమిస్ట్రీ సినిమాలో హైలైట్‌గా ఉంటుంది’’ అని తన పాత్ర గురించి పేర్కొన్నారు మీనాక్షి. ‘మహర్షి’ చిత్రం మే 9న  విడుదల కానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. తొలి పాటను ఈ 29న విడుదల చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement