బ్యాడ్‌ లక్‌

Adah Sharma injured on Commando 3 set - Sakshi

సిల్వర్‌ స్క్రీన్‌పై యాక్షన్‌ సన్నివేశాలను చూసి ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తారు. కానీ ఆ యాక్షన్‌ సీన్స్‌ వెనక ఆర్టిస్టుల కష్టం దాగి ఉంటుంది. టైమ్‌ బాగా లేకపోతే యాక్టర్స్‌కి గాయాలు తప్పవు. అలా అదా శర్మ టైమ్‌ బాగోలేదు. అందుకే ఆమె ‘కమాండో 3’ సెట్‌లో గాయపడ్డారు. కమాండో ఫ్రాంచైజీలో రూపొందుతున్న థర్డ్‌ పార్ట్‌ ఇది. ఇందులో విద్యుత్‌ జమాల్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లోని ఓ యాక్షన్‌ సీన్‌లో భాగంగా కార్‌ డోర్‌ క్లోజ్‌ చేయబోయే ప్రాసెస్‌లో అదా శర్మ గాయపడ్డారు.

ఆమె చిటికెన వేలు చితికిపోయింది. ఈ విషయాన్ని అదా సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు. ‘‘రెండు చేతులకు కలపి తొమ్మిది వేళ్లు ఉన్నా కూడా నన్ను లవ్‌ చేస్తారు కదూ. దేవుడి దయ వల్ల  ఆ మిగిలిన వేలు కూడా ఇంకా నా బాడీలో భాగమై ఉంది’’ అని పేర్కొన్నారు అదా శర్మ. ‘‘నిజానికి అదా శర్మ గాయపడ్డప్పుడు చాలా రక్తం పోయింది. కానీ ఆమె వెంటనే హస్పిటల్‌కి వెళ్లకుండా లొకేషన్‌లోనే ఫస్ట్‌ ఎయిడ్‌ చేయించుకుని షూట్‌లో పాల్గొన్నారు. అదాకి ఇలా గాయం కావడం బ్యాడ్‌లక్‌’’ అని టీమ్‌ పేర్కొంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top