త్రిష మళ్లీ ప్రేమలో పడిందా.‌?

Actress Trisha Again Fall in Love - Sakshi

సాక్షి, సినిమా: చెన్నై చిన్నది త్రిష మళ్లీ ప్రేమలో పడిందా.? ప్రస్తుతం సినీ వర్గాల్లో ఇదే చర్చ కొనసాగుతోంది. త్రిష తనకు నచ్చింది చేసేస్తుంది.. అది ఆమె ధైర్యం కావచ్చు, ఆత్మ విశ్వాసం కావచ్చు, పెరిగిన వాతావరణం కావచ్చు, వృత్తి పరంగా వచ్చిన స్వేచ్ఛ కావచ్చు. వయసు పరంగా ఆమె మూడున్నర దశాబ్దాలు పూర్తి చేసుకుంది. అయినా త్రిషను చూస్తే అలా అనిపించదు. అందుకు తను తీసుకునే ఆరోగ్య పరమైన సూత్రాలే కారణం కావచ్చు. అందుకే నేటికీ ప్రముఖ కథానాయకిగా రాణిస్తోంది. ఇప్పటికీ హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రాలు అధికంగా ఆమెను వరించడం విశేషమే. 

ప్రస్తుతం త్రిష చేతిలో మోహిని, గర్జన వంటి కథానాయకి పాత్రలతో కూడిన చిత్రాలతో పాటు 96, చతురంగవేట్టై - 2, 1818 తదితర చిత్రాలు ఉన్నాయి. మరిన్ని కథలను వింటున్నానని, త్వరలోనే ఒక సంచలన చిత్రం గురించిన వివరాలను చెబుతానని ఇటీవల త్రిష తెలిపింది. మొత్తంగా 15 ఏళ్లుగా కథానాయకిగా రాణిస్తున్న త్రిష గురించి వదంతులు చాలానే ప్రచారం అవుతున్నాయి. చాలా కాలం క్రితమే త్రిష నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్‌ మణియన్‌ను ప్రేమించింది. అది పెళ్లి వరకూ వెళ్లి ఆగిపోయింది. ఆ తరువాత ప్రేమ ఊసెత్తని ఈ అమ్మడు తాజాగా ఆ పనిలో ఉన్నట్లు సంకేతాలు ఇవ్వడం విశేషం. 

త్రిషకు విదేశీ విహారం చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే షూటింగ్‌ గ్యాప్‌ వచ్చినప్పుడల్లా విదేశాలకు చెక్కేస్తుంది. ప్రస్తుతం త్రిష కెనడాలో విహరిస్తోంది. అక్కడ ఎత్తైన ప్రాంతానికి వెళ్లి ఫొటోలు తీసుకుని వాటిని ట్విటర్‌లో పోస్ట్‌ చేసి సంచలనం కలిగించింది. పనిలో పనిగా ఏ టేబుల్‌ ఫర్‌ టూ అనే పదాలను పోస్ట్‌ చేసింది. దీంతో త్రిష మళ్లీ ప్రేమలో పడింది.. అంటూ ఆమె అభిమానులు రకరకాల కొటేషన్స్‌తో ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. త్రిష పెళ్లికి రెడీ అవుతోందిరా.. అంటూ కొందరు, ఎవరా లవర్‌.? అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top