నరకాసురన్‌లో ఆద్మిక | Actress admika selected in Narakasuran's film | Sakshi
Sakshi News home page

నరకాసురన్‌లో ఆద్మిక

Aug 31 2017 3:18 AM | Updated on Sep 17 2017 6:09 PM

నరకాసురన్‌లో ఆద్మిక

నరకాసురన్‌లో ఆద్మిక

అరవిందస్వామి చిన్న గ్యాప్‌ తరువాత రీఎంట్రీ అయ్యి విలన్‌గా మారి మంచి పేరు తెచ్చుకున్నారు.

తమిళసినిమా: అరవిందస్వామి చిన్న గ్యాప్‌ తరువాత రీఎంట్రీ అయ్యి విలన్‌గా మారి మంచి పేరు తెచ్చుకున్నారు. తనీఒరువన్‌ చిత్రంలో ఆయన స్టైలిష్‌ విలనిజం ప్రేక్షకులను మెప్పించింది. కాగా తాజాగా మరోసారి హీరోగా తన సత్తా చాటడానికి రెడీ అయ్యారు. అప్పటికే చతురంగవేట్టై–2 చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నారు. అదే విధంగా నరకాసురన్‌ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. దీన్ని ఇంతకు ముందు దృవంగళ్‌ 16 చిత్రంతో చిత్ర పరిశ్రమ మొత్తం దృష్టిని తన వైపు తిప్పుకున్న యువ దర్శకుడు కార్తీక్‌ నరేన్‌ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇందులో అరవిందస్వామితో పాటు నటి శ్రియ, సందీప్‌కిషన్‌ నటించడానికి ఎంపికయ్యారు. తాజాగా యువ నటి ఆద్మికను ఎంపిక చేసినట్లు దర్శకుడు కార్తీక్‌ నరేన్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆద్మిక వీసైమురుక్కు చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన నటి అన్నది తెలిసిందే. తొలి చిత్రంతోనే తమిళ ప్రేక్షకుల ఆదరణను పొందిన ఈ అమ్మడికిప్పుడు వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయట. అందులో ఒకటి నరకాసురన్‌. ఈ చిత్ర ప్రి ప్రొడక్షన్‌ కార్యక్రమాలు వేగంగా జరగుతున్నాయట. సెప్టెంబర్‌ 16న చిత్ర షూటింగ్‌ను ఊటీలో ప్రారంభించనున్నట్లు, అక్కడే 40 రోజుల పాటు చిత్రీకరించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement