కొత్త ఏడాదిలో ప్రముఖ హీరో ఇంట విషాదం | actor vikram father passes away | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాదిలో ప్రముఖ హీరో ఇంట విషాదం

Jan 1 2018 1:05 PM | Updated on Apr 3 2019 8:57 PM

actor vikram father passes away - Sakshi

కొత్త సంవత్సర వేళ ప్రముఖ నటుడి ఇంట విషాదం నెలకొంది.

కొత్త సంవత్సర వేళ ప్రముఖ నటుడి ఇంట విషాదం నెలకొంది. హీరో విక్రమ్‌ తండ్రి వినోద్‌రాజ్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. వినోద్‌రాజ్‌ వయసు 80 ఏళ్లు. విక్రమ్‌ తండ్రి మాజీ సైనికుడు.. నటుడుగా కూడా ఆయన పలు కన్నడ, తమిళ చిత్రాలలోనూ, బుల్లితెర సీరియళ్లలోనూ నటించారు. తిరుపాచ్చి, గిల్లీ వంటి చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు.

గిల్లీ చిత్రంలో నటి త్రిషకు తండ్రిగా నటించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం సాయంత్రం స్థానిక మహాలింగపురంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిశారు. దీంతో విక్ర‌మ్ కుటుంబంలో విషాద‌ఛాయ‌లు నెల‌కొన్నాయి. ఆయన పార్థీవ దేహానికి పలువురు సినీ ప్రముఖులు అంజలి ఘటించారు.  ఆయన భౌతిక కాయానికి ఈరోజు అంతక్రియలు జరగనున్నట్లు విక్రమ్‌ బంధువులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement