అందుకే డైరెక్టర్‌ పేరు వేయలేదు!

Actor Srikanth Press Meet About Ra Ra Telugu Movie  - Sakshi

‘‘ఇంతకుముందు మోహమాటానికి కొన్ని సినిమాలు ఒప్పుకున్నాను. ఇప్పుడు ఒప్పుకోవడం లేదు. నాకు ఇష్టం అయితే సినిమా చేస్తాను. హీరోగా చేస్తా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేస్తా, విలన్‌గా చేస్తా. డెస్టినీ ఎటు తీసుకెళ్తే అటు వెళ్తా. హీరోగా మంచి హిట్స్‌ ఉన్నప్పుడు కూడా నటుడిగా డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ చేశాను. ఇప్పుడు ఇండస్ట్రీలో నేనున్న పొజిషన్‌కి హ్యాపీగానే ఉన్నాను’’ అన్నారు శ్రీకాంత్‌. శ్రీ మిత్ర చౌదరి సమర్పణలో శ్రీకాంత్, నాజియా హీరోహీరోయిన్లుగా విజి చెర్రీస్‌ విజన్స్‌ పతాకంపై విజయ్‌ నిర్మించిన ‘రా..రా’ చిత్రం ఈ రోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో శ్రీకాంత్‌ చెప్పిన విశేషాలు...

► నా కెరీర్‌లో ‘రా..రా’ సినిమా 125మూవీ అనుకుంటున్నాను. తొలిసారి ఎంటర్‌టైన్మెంట్‌ మిక్సై ఉన్న హారర్‌ జోనర్‌ను టచ్‌ చేశాను. నిర్మాతలు నా మిత్రులే. అగ్రిమెంట్‌ పరంగా డైరెక్టర్‌కు, నిర్మాతలకు అభిప్రాయభేదాలు వచ్చాయి. అందుకే రిలీజ్‌ పోస్టర్‌పై దర్శకుని పేరు లేదు. సమస్యను సాల్వ్‌ చేయడానికి ట్రై చేశాను. కుదర్లేదు. ఏ సినిమాకైనా నిర్మాత ముఖ్యమని నేను భావిస్తాను. కథ వేరే రచయిత అందించారు. ఒక పెద్ద పేరున్న డైరెక్టర్‌ ఈ సినిమాను టేకప్‌ చేశారు. పేరొద్దన్నారు. సినిమా హిటై్టనా, ఫ్లాప్‌ అయినా ఆయన పేరు చెప్పదలచుకోలేదు.

► కథ విషయానికొస్తే.. మూవీ డైరెక్టర్‌గా ఉన్న నేను తెలియక దెయ్యాన్ని ప్రేమిస్తాను. అప్పుడు ఏం జరిగింది అనేది స్క్రీన్‌పై సూపర్‌గా ఉంటుంది. ఇందులో మూడు పాటలున్నాయి. ర్యాప్‌రాక్‌ షకీల్‌ మంచి సంగీతం అందించారు. సినిమా చూశాను. అవుట్‌పుట్‌ పట్ల ఫుల్‌ హ్యాపీ. ‘ఆపరేషన్‌–
2019’కి కూడా షకీల్‌నే స్వరకర్త.

► కృష్ణవంశీగారితో తప్పకుండా సినిమా ఉంటుంది. ఎప్పుడనేది చెప్పలేను. ఫెయిల్యూర్స్‌ వచ్చాయని స్నేహితులను దూరం చేసుకోను. ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాలో నేను నటించడానికి చర్చలు జరిగాయి. ప్రస్తుతానికైతే నేను చేయడం లేదు. నేను విలన్‌గా చేసిన ‘యుద్ధం శరణం’ సినిమా నిరాశపరిచింది. నిరుత్సాహపడ్డాను. ఆ తర్వాత కూడా విలన్‌గా ఆఫర్స్‌ వచ్చాయి. కానీ చేయలేదు.

► హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో ప్రభుదేవా ముఖ్య పాత్రలో రూపొందుతున్న సినిమాలో నా మూడో అబ్బాయి రోహన్‌ నటిస్తున్నాడు. కన్నడలో వేరే వాళ్లు కనిపిస్తారు. ఇప్పుడు షూటింగ్‌ కోసం రోహన్‌ ఊటీలో ఉన్నాడు. నేను, రోహన్‌ ఓ సినిమా చేయాల్సింది.. కుదర్లేదు.

► ప్రస్తుతం యాక్టింగ్‌లో డిప్లొమా చేస్తున్నాడు రోషన్‌. నెక్ట్స్‌ సినిమా చేయడానికి టు ఇయర్స్‌ టైమ్‌ పడుతుంది. ‘నిర్మలా కాన్వెంట్‌’ సినిమా రోషన్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. యాక్టింగ్‌ మీద మరింత ఆసక్తి పెరిగింది. మా అమ్మాయి బాగా చదువుకుంటుంది. స్పోర్ట్స్‌ బాగా ఆడుతోంది. ఎవరి డెస్టినీ ఎలా ఉంటుందో ముందే ఊహించలేం.

► ‘ఆపరేషన్‌ 2019’ పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా. కరణం బాజ్జీ దర్శకుడు. ఏ పార్టీని టార్గెట్‌ చేయడం లేదు. వివాదాలు తలెత్తకుండ తెరకెక్కిస్తున్నాం. ఇందులో హీరో మంచు మనోజ్‌ పోలీసాఫీసర్‌గా గెస్ట్‌ రోల్‌ చేయనున్నారు. కన్నడలో సుదీప్, శివరాజ్‌కుమార్‌ కలిసి నటిస్తున్న సినిమాలో విలన్‌గా చేస్తున్నాను. కన్నడలో ఆఫర్స్‌ వచ్చాయి. కానీ టాలీవుడ్‌ నా ఇంట్రెస్ట్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top