వాడిలో నిన్ను చూసుకుంటాం.. వచ్చేయ్‌: అర్జున్‌

Action King Arjun bBds Farewell To Nephew Chiranjeevi Sarja - Sakshi

బెంగళూరు: కన్నడ హీరో చిరంజీవి సర్జా(39) మృతిపై యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తో సహా కుటుంబ సభ్యులంతా ఇప్పటికీ శోకసంద్రంలో మునిగిపోయారు. చిరంజీవి సర్జా అర్జున్‌కు మేనల్లుడు. చిరంజీవితో అర్జున్‌కు ఎంతో సానిహిత్యం ఉండేది. అంతేగాక చిరంజీవి అంతిమ కర్మలు ముగిసే వరకు కూడా అర్జున్‌ అక్కడే ఉన్నారు. కాగా జూన్‌ 7న చిరంజీవి సర్జా ఆకస్మికంగా గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. బెంగుళూరులో ఉన్న ఫాంహౌజ్‌లో ఈనెల 8న కుటుంబ సభ్యుల మధ్య ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.  తాజాగా శుక్రవారం చిరంజీవి సోదరుడు ధృవ్‌ సర్జా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. సర్జా కుటుంబ సభ్యులను అందరి చిత్రాలతో వీడియోను రూపొందించి ‘అన్నయ్య లవ్‌ యూ సోమచ్‌’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్‌లో అర్జున్‌ వాయిస్‌ వినిసిస్తూ..తన అభిమాన మేనల్లుడికి వీడ్కోలు చెబుతూ, అతన్ని చాలా మిస్‌ అవుతున్నానని అర్జున్‌ చెప్పారు. (మన బిడ్డ రూపంలో నిన్ను తీసుకొస్తా!)

‘నిరాశ చెంది, కోపంతో నువ్వు కొన్ని రోజులు దూరంగా వెళ్లేవాడివి. కానీ అది వేరు. ఇప్పుడు నువ్వు మళ్లీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి, మా అందరికి దూరం అయ్యావు. నేను కళ్లు మూసిన ప్రతిసారి నీ చిరునవ్వు కనిపిస్తోంది. కొద్దిరోజుల్లో మేము నిన్ను మరిచిపోతాం అంటే అది అబద్దం. నీ మరణం మమ్మల్నీ ఎంతగానో గాయపరిచింది. నువ్వు ఎప్పటికీ మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతావు. మీ తాత నీకు చిరంజీవి అని పేరు పెట్టారు, అది నిజమే. నీ మాటలు, చిరునవ్వు, జ్ఞాపకాలు, మా బంధం చిరంజీవిగా నిలిచిపోతాయి.’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. (‘నువ్వు లేకుండా ఉండలేం.. వచ్చేయ్‌’)

కాగా చనిపోయిన తన మేనల్లుడిని తన బిడ్డలో చూసుకోవాలన్న కోరికను అర్జున్‌ వ్యక్తపరిచాడు. ‘దయచేసి నువ్వు నీ పిల్లల రూపంలో మళ్లీ మా వద్దకు తిరిగి వచ్చేయ్‌. చిన్న పిల్లావాడి చిరునవ్వులో మీ ప్రతిబింబాన్ని చూసుకుంటాం. చిరు.. నిన్ను మేము చాలా ప్రేమిస్తున్నాము. మేము ఎప్పటికీ నీ జ్ఞాపకాలతోనే జీవిస్తాం. ప్రేమతో నీ కుటుంబం. అభిమానులు అంటూ అర్జున్‌కన్నీటి పర్యంతమయ్యారు. ఇదిలా ఉండగా 2018 మే 2న నటి మేఘనా రాజ్‌ను చిరంజీవి వివాహమాడారు.ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భవతి. (కన్నీటిపర్యంతమైన అర్జున్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top