అమ్మ ప్రార్థనలే నన్ను కాపాడుతున్నాయి

abhimanyudu released 26 january - Sakshi

చిన్నప్పుడు జరిగిన సంఘటనలు పెద్దయ్యాక గుర్తు చేసుకుంటుంటే భలే గమ్మత్తుగా అనిపిస్తుంటాయి. సమంత కూడా తన బాల్యానికి సంబంధించిన చిన్ని చిన్ని జ్ఞాపకాలను అప్పుడప్పుడూ నెమరు వేసుకుంటుంటారు. కొన్ని విషయాలను బయటకు కూడా చెబుతుంటారు. ‘‘ప్రతి బుధవారం, శనివారం, ఆదివారం మా అమ్మగారు నన్ను చర్చ్‌కు లాక్కొని వెళ్లేవారు. చిన్నప్పుడు చాలా చిరాకుగా అనిపిస్తుండేది. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే తన ప్రార్థనలే నన్ను కాపాడుతున్నాయి అనిపిస్తుంది’’ అని సమంత పేర్కొన్నారు. అంతే.. చిన్నప్పుడు పెద్దవాళ్లు చెప్పినవన్నీ చిరాకుగానే అనిపిస్తాయి.

పెద్దయ్యాక ఆ మాటలకు విలువ తెలుస్తుంది. ఇది కాకుండా సమంత మరో స్వీట్‌ మెమరీని కూడా పంచుకున్నారు. ‘‘ఒకసారి పరీక్షలప్పుడు నేను విపరీతమైన అనారోగ్యానికి గురయ్యాను. మా అమ్మగారు నాతో పాటు స్కూల్‌కి వచ్చి నా పక్కనే కూర్చుని పరీక్ష రాయించారు. యాక్చువల్లీ నాకు రాసే ఓపిక కూడా లేదు. కానీ, పక్కనే అమ్మ ఉందనే బలం నాతో రాయించింది. మై మామ్‌ ఈజ్‌ ట్రూలీ అమేజింగ్‌’’ అని చెప్పుకొచ్చారు సమంత. ప్రస్తుతం సమంత ‘మహానటి, రంగస్థలం’ సినిమాలు చేస్తున్నారు. తమిళంలో నటించిన ‘ఇరుంబుదురై’ తెలుగులో ‘అభిమన్యుడు’గా జనవరి 26న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top