అది నా కెరీర్ కు ఒక మలుపు! | Aashiqui 2 is a big break as a lead in Bollywood, Aditya Roy Kapoor | Sakshi
Sakshi News home page

అది నా కెరీర్ కు ఒక మలుపు!

Sep 15 2014 7:58 PM | Updated on Apr 3 2019 6:23 PM

అది నా కెరీర్ కు ఒక మలుపు! - Sakshi

అది నా కెరీర్ కు ఒక మలుపు!

బాలీవుడ్ లో తన ప్రస్థానం కొనసాగించటానికి ‘ఆషికి-2’ సినిమా అనేది ఒక గొప్ప మలుపని ఆదిత్యారాయ్ కపూర్ అంటున్నాడు.

న్యూఢిల్లీ: బాలీవుడ్ లో తన ప్రస్థానం కొనసాగించటానికి ‘ఆషికి-2’ సినిమా అనేది ఒక గొప్ప మలుపని ఆదిత్యారాయ్ కపూర్ అంటున్నాడు. 28 ఏళ్ల ఆదిత్య ‘లండన్ డ్రీమ్స్’, యాక్షన్ రీ ప్లే’, ‘గుజారిష్’ తదితర సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ‘నాకు మొదటినుంచీ ఏదో ఒక రోజు కెరీర్‌లో మంచి మలుపు వస్తుందనే నమ్మకం ఉంది. అయితే ‘యే జవానీ దివానీ’ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. మోహిత్ సూరి నేతృత్వంలో రూపొందించిన ‘ఆషికి-2’సినిమాలో ప్రధాన భూమిక నాదే. సోలో హీరో సినిమా అవకాశాలు రాలేదని నేను ఏనాడూ బాధపడలేదు. ఏ నిర్మాత అయినా వాణిజ్యపరంగా ఇబ్బందులు లేని కథానాయకుడు ఉండాలని కోరుకుంటాడు. అందువల్ల ఈ విషయంలో నేను ఎవరినీ నిందించదలుచుకోలేదు.

 

అయితే అదృష్టం ‘ఆషికి-2’సినిమా రూపంలో వరించింది. చిన్న చిన్న పాత్రలు చేసే రోజుల్లో ఏనాడూ నిరాశకు గురికాలేదు. 2013లో విడుదలైన సినిమాల్లో ‘ఆషికి-2’ రికార్డు సృష్టించింది’ అని అన్నాడు. ఈ సినిమాలో ఆదిత్య... మద్యానికి అలవాటుపడిన యువకుడి పాత్రలో కనిపిస్తాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement