‘దూకుడు’కు పదింతలు | aagadu movie will collect10 times greater than dhukudu | Sakshi
Sakshi News home page

‘దూకుడు’కు పదింతలు

Oct 26 2013 12:44 AM | Updated on Sep 1 2017 11:58 PM

‘దూకుడు’కు పదింతలు

‘దూకుడు’కు పదింతలు

‘దూకుడు’తో బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ కొల్లగొట్టిన కాంబినేషన్ మహేష్, శ్రీనువైట్లది. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి పనిచేస్తున్న ‘ఆగడు’ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది.

 ‘దూకుడు’తో బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ కొల్లగొట్టిన కాంబినేషన్ మహేష్, శ్రీనువైట్లది. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి పనిచేస్తున్న ‘ఆగడు’ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, డా.డి.రామానాయుడు క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ -‘‘అభిమానులు, ప్రేక్షకులు మహేష్‌ని ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి పాత్రను ఇందులో మహేష్ పోషించనున్నారు. మాస్ ప్రేక్షకులు మెచ్చేలా ఆయన పాత్ర ఉంటుంది.
 
  ఎప్పట్నుంచో మహేష్‌ని ఇలా చూడాలనుకుంటున్నాను. దానికి ట్రైలర్‌గానే ‘దూకుడు’ తీశాను. ఆ సినిమాలోని పాత్రకు పదింతలు గొప్పగా ఉంటుంది ఇది. పాత్ర చిత్రణ కూడా భిన్నంగా ఉంటుంది’’ అన్నారు. చాలా హై రేంజ్‌లో ఈ చిత్రం నిర్మాణం ఉంటుందని, మహేష్ కెరీర్‌లోనే మెమర బుల్ మూవీగా ఈ చిత్రం నిలుస్తుందని నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర నమ్మకం వ్యక్తం చేశారు. నవంబర్ 15 నుంచి ఏకధాటిగా చిత్రీకరణ జరిపి ఏప్రిల్‌కి సినిమాను పూర్తి చేస్తామని, వేసవి కానుకగా సినిమాను విడుదల చేస్తామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత కోటి పరుచూరి చెప్పారు. మహేష్‌కి జోడీగా తమన్నా తొలిసారి నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందంతో పాటు ప్రముఖ తారాగణం నటిస్తారు. ఈ చిత్రానికి రచన: అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, సంగీతం: ఎస్.ఎస్.తమన్, ఛాయాగ్రహణం: కె.వి.గుహన్, కళ: ఏఎస్ ప్రకాష్, కూర్పు: ఎం.ఆర్.వర్మ, నిర్మాణం: 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లిమిటెడ్.
 

Advertisement
Advertisement