సెప్టెంబర్ 6న ‘జోడి’ విడుదల | Aadi Sai Kumar Jodi releasing On 6th September | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 6న ‘జోడి’ విడుదల

Aug 5 2019 4:35 PM | Updated on Aug 5 2019 4:35 PM

Aadi Sai Kumar Jodi releasing On 6th September - Sakshi

బుర్రకథ సినిమాతో రీసెంట్‌గా ఆడియెన్స్‌ను పలకరించిన ఆది సాయికుమార్‌కి నిరాశే ఎదురైంది. అయితే చాలా గ్యాప్‌ తరువాత వచ్చిన ఈ చిత్రంపై హైప్‌క్రియేట్‌ అయినా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే ఆది జోడి అనే మరో చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. 

శ్రద్దా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ షూటింగ్‌ పూర్తైనట్లు యూనిట్‌ ప్రకటించింది. ఇటీవలె టీజర్‌ను విడుదల చేసిన చిత్రబృందం ఈ సినిమాను సెప్టెంబర్‌ 6న విడుదల చేయనున్నట్లు తెలిపింది. గతంలో వాన, మస్కా, సినిమా చూపిస్త మామ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన విశ్వనాథ్ అరిగెల ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో సీనియర్ యాక్టర్ వి.కే. నరేష్, సత్య, వెన్నెల కిశోర్, సిజ్జు, స్వప్నిక, సితార, మాధవి, గొల్లపూడి మారుతిరావు, వర్షిణి సౌందరరాజన్, ప్రదీప్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement