ఇండిపెండెన్స్ డే రోజు లండన్లో రహ్మాన్ | A.R. Rahman to perform in London on Indian Independence Day | Sakshi
Sakshi News home page

ఇండిపెండెన్స్ డే రోజు లండన్లో రహ్మాన్

Aug 12 2015 3:25 PM | Updated on May 24 2018 3:01 PM

ఇండిపెండెన్స్ డే రోజు లండన్లో రహ్మాన్ - Sakshi

ఇండిపెండెన్స్ డే రోజు లండన్లో రహ్మాన్

ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రహ్మాన్ ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయంలో బ్రిటన్లో అలరించనున్నారు.

న్యూఢిల్లీ: ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రహ్మాన్ ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయంలో బ్రిటన్లో అలరించనున్నారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆయన మరోసారి లండన్లో కార్యక్రమం నిర్వహించనున్నారు.

'లండన్లోని ప్రియమైన అభిమానులారా, స్నేహితులారా ఓ2 అరెనా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమం ద్వారా మీ అందరిని చూసేందుకు చాలా ఆతృతగా ఉన్నాను' అని రహ్మాన్ ట్వీట్ చేశారు. ఇక ఓ2 అరెనా సంస్థ కూడా తన అధికారిక వెబ్ సైట్లో 'రెండు గ్రామీ అవార్డులు, రెండు ఆస్కార్ అవార్డులు, బీఏఎఫ్టీఏ, గోల్డెన్ గ్లోబ్ అవార్డుల విజేత(ఏఆర్ రహ్మాన్) దాదాపు ఐదేళ్ల తర్వాత ఓ2కి ఆగస్టు 15 శనివారం రోజు వస్తున్నారు' అంటూ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement