మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ | 80 cr budjet film in mahesh babu, murugadoss combination | Sakshi
Sakshi News home page

మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్

Oct 9 2015 2:42 PM | Updated on Sep 3 2017 10:41 AM

మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్

మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్

స్టార్ హీరోలు నటించే సినిమాలు ఒకటి సెట్స్ మీద ఉండగానే వారు చేయబోయే తరువాతి ప్రాజెక్ట్ మీద చర్చ మొదలవుతుంది. అదే మహేష్ లాంటి స్టార్ హీరో సినిమా అయితే ఈ చర్చ మరింత ముందుగానే...

స్టార్ హీరోలు నటించే సినిమాలు ఒకటి సెట్స్ మీద ఉండగానే వారు చేయబోయే తరువాతి ప్రాజెక్ట్ మీద చర్చ మొదలవుతుంది. అదే మహేష్ లాంటి స్టార్ హీరో సినిమా అయితే ఈ చర్చ మరింత ముందుగానే ప్రారంభమవుతుంది. అందుకే ప్రస్తుతం 'బ్రహ్మోత్సవం' సినిమా షూటింగులో ఉన్న మహేష్ తన తదుపరి చిత్రాన్ని ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు.

ఇటీవల మహేష్ను కలిసిన మురుగదాస్, ఓ భారీ యాక్షన్ స్టోరీని వినిపించాడట. ప్రిన్స్కు కూడా కథ నచ్చటంతో వెంటనే పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయాలని కోరాడు. ప్రస్తుతం మహేష్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహ్మోత్సవం' సినిమాలో నటిస్తుండగా... మురుగదాస్, సొనాక్షిసిన్హా ప్రధాన పాత్రలో 'అకీరా' అనే రీమేక్ సినిమాను హిందీలో తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే మహేష్, మురుగదాస్ కాంబినేషన్లో సినిమాకు పట్టాలెక్కనుంది.

తెలుగులో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా తమిళ వెర్షన్లో విజయ్ హీరోగా నటించనున్నాడు. అంతేకాదు ఈ సినిమాను మహేష్, మురుగదాస్ల కెరీర్ లోనే భారీ బడ్జెట్తో దాదాపు 80 కోట్లతో రూపొందించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. డబ్బింగ్ సినిమాలతో సక్సెస్ కొట్టినా.. స్ట్రయిట్ సినిమా 'స్టాలిన్'తో నిరాశపరిచిన మురుగదాస్, ఈ సారి ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement