చార్మి పాటకు రూ.3 కోట్లు | Sakshi
Sakshi News home page

చార్మి పాటకు రూ.3 కోట్లు

Published Thu, Mar 5 2015 12:31 AM

చార్మి పాటకు రూ.3 కోట్లు

నటి చార్మి సింగిల్ సాంగ్‌లో నటించడానికి పచ్చజెండా ఊపడంతో ఆమెకిప్పుడు అన్నీ అలాంటి అవకాశాలే తలుపు తడుతున్నాయి. ఆ మధ్య తెలుగులో ఎస్కో నా గుమ గుమా ఛాయ్ అంటూ కుర్రకారుకు కిరాక్ పుట్టించిన ఈ ముద్దుగుమ్మకు ఐటమ్ సాంగ్  ఛాన్స్‌లు రావడం మొదలెట్టాయి. కథానాయకిగా అవకాశాలు కనుమరుగవ్వడంతో సింగిల్ సాంగ్ అవకాశాలు బాగున్నాయనుకుని వాటి సంగతి చూసేస్తే పోలా అన్న నిర్ణయానికి వచ్చిన చార్మి ఇటీవల విక్రమ్ హీరోగా నటిస్తున్న పత్తు ఎండ్రత్తుకుళే చిత్రంలో ఐటమ్ సాంగ్ చేశారు. గోలీసోడావంటి చిన్న చిత్రంతో పెద్ద విజయం సాధించిన దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో చార్మి సింగిల్ సాంగ్‌కు మాత్రమే ఖర్చు చేసిన డబ్బు మూడు కోట్లు అని కోలీవుడ్ వర్గాల సమాచారం. కోటి రూపాయల కంటే తక్కువ ఖర్చు అయ్యే గోలీసోడా తీసి సక్సెస్ సాధించిన విజయ్ మిల్టన్ తదుపరి చిత్రంలో ఒక్క సాంగ్‌కే మూడు కోట్లు ఖర్చు చేయడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఐ వంటి బ్రహ్మాండమైన చిత్రం తరువాత విక్రమ్ నటిస్తున్న చిత్రం కావడంతో ఆ మాత్రం భారీతనం అవసరమేనంటున్నారు పత్తు ఎండ్రత్తుకుళే చిత్ర వర్గాలు. ఏదేమైనా ఇలాంటి విషయాలతో నటి చార్మి మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. ఈ చర్చ ఆమెకు మరిన్ని అవకాశాలు తెచ్చి పెడుతుందో, లేదో? చూద్దాం. ఈ చిత్రంలో కథానాయకిగా చెన్నై చిన్నది సమంత నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement