టీజర్‌ ఆసక్తికరంగా ఉంది

28'c Movie Teaser Launch - Sakshi

–సుమంత్‌

నవీన్‌చంద్ర, షాలిని వడ్ని జంటగా అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వంలో సాయి అభిషేక్‌ నిర్మించిన చిత్రం ‘28 డిగ్రీస్‌ సెల్సీయస్‌’. ఈ చిత్రానికి విక్రమ్‌ జూపూడి, సంజయ్‌ జూపూడి సహ–నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రం పోస్టర్, టీజర్‌ లాంచ్‌ హైదరాబాద్‌లో జరిగింది. టైటిల్‌ పోస్టర్‌ను సుమంత్, టీజర్‌ను అడవి శేష్‌ విడుదల చేశారు. అనంతరం సుమంత్‌ మాట్లాడుతూ– ‘‘అనిల్‌ నాకు ఐదేళ్లుగా తెలుసు. నా సినిమాకు కో–ప్రొడ్యూసర్‌గా కూడా వర్క్‌ చేశాడు. అప్పట్నుంచే అతనికి డైరెక్షన్‌ అంటే తపన.

ఓసారి ఈ సినిమా లైన్‌ చెప్పినప్పుడు నాకు అంతగా ఎక్కలేదు. ఇప్పుడు టీజర్‌ చూశాక బాగా నచ్చింది. కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. ప్రేక్షకులకు రీచ్‌ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘అనిల్‌ నాకు ‘కర్మ’ సినిమా నుంచి తెలుసు. ఈ టీమ్‌ నేను నటించిన ‘క్షణం, గూఢచారి’ సినిమాలకు వర్క్‌ చేశారు. అనిల్‌తో ఓ సినిమా చేయాలనుకుంటున్నాను. ఈ చిత్రం టీజర్‌ జెన్యూన్‌గా ఉంది. ఈ చిత్రం విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అడవి శేష్‌. ‘‘అరవిందసమేత..’ సినిమాలో నేను చేసిన బాల్‌రెడ్డి క్యారెక్టర్‌కు మంచి స్పందన వచ్చింది.

ఆ సినిమా తర్వాత చాలా ఆఫర్లు వస్తున్నాయి. అనిల్, అభిషేక్‌ వచ్చి ఈ సినిమా కథ చెప్పారు నాకు. వెరీ ఇంటెన్స్‌ లవ్‌స్టోరీ. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది’’ అన్నారు నవీన్‌చంద్ర. ‘‘ఇది నా కల. టైటిల్‌ఎంత కొత్తగా ఉంటుందో సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది. అరవై శాతం జార్జియాలో షూట్‌ చేశాం. అక్కడి ఓ తెలుగువాడి కథ ఇది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన హీరో నవీన్, అభిషేక్‌కు థ్యాంక్స్‌’’ అన్నారు అనిల్‌. ‘‘ఇదొక సస్పెన్స్‌ లవ్‌థ్రిల్లర్‌. టైటిల్‌కు తగ్గట్లు అనిల్‌ తెరకెక్కించాడు. సినిమాను మేలో రిలీజ్‌  చేయాలను కుంటున్నాం’’ అన్నారు సాయి అభిషేక్‌. శ్రావణ్‌ భరద్వాజ్‌ సంగీతం అందించిన ఈ చిత్రానికి తేజ వర్మ, జుంగా పృథ్వీ అసోసియేట్‌ ప్రొడ్యూసర్స్‌. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top