నిజమైన ప్రేమ | 2 Friends True Love pressmeet | Sakshi
Sakshi News home page

నిజమైన ప్రేమ

Nov 25 2017 12:50 AM | Updated on Nov 25 2017 12:50 AM

2 Friends True Love pressmeet - Sakshi

ప్రేమ గొప్పదా? స్నేహం గొప్పదా? అనే అంశాలను చర్చిస్తూ రూపొందిన తెలుగు, కన్నడ సినిమా ‘2 ఫ్రెండ్స్‌’. ట్రూ లవ్‌... ఉపశీర్షిక. సూరజ్‌ హీరోగా జి.ఎల్‌.బి. శ్రీనివాస్‌ దర్శకత్వంలో మళ్ళగూరు అనంతరాముడు, మళ్ళగూరు రమేశ్‌నాయుడు నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణతో పాటు డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం రీ–రికార్డింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ప్రేమ, స్నేహం, వినోదంతో రూపొందిన మంచి సందేశాత్మక చిత్రమిది. ఇప్పటి యువత ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. కాలేజీ రోజుల్లోనే యువత భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. అటువంటి సమయంలో వారు ప్రేమ, స్నేహం అంశాలను ఎలా చూస్తున్నారనేది సినిమా’’ అన్నారు. రవీంద్రతేజ, సానియా, స్నిగ్ధ, కార్తీక్, సారా, ధనరాజ్, కోట శ్రీనివాసరావు, జయప్రకాశ్‌రెడ్డి, వై. విజయ, శ్రీలక్ష్మీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ, మాటలు, సంగీతం: పోలూర్‌ ఘటికాచలం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement