
తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కువమంది సుదీప్‌ను ‘ఈగ’ విలన్‌గానే గుర్తుపడతారు. కానీ, కన్నడంలో అతనో పెద్ద స్టార్ హీరో. డైరెక్టర్ కూడా. ఆస్ట్రేలియన్ ఫిల్మ్‌మేకర్ ఎడ్డీ తీస్తున్న హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్‌లో సుదీప్ ఓ క్యారెక్టర్ చేయనున్నారు. ఈ న్యూస్ ఎప్పుడో బయటకొచ్చింది. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... అందులో సుదీప్ న్యూయార్క్‌లో నివసించే ఎన్నారైగా కనిపించనున్నారు.
రీసెంట్‌గా ఎడ్డీ ఇండియా వచ్చారు. డైరెక్టుగా బెంగళూరు వెళ్లి, సుదీప్‌ను కలిశారు. మాక్ టెస్ట్ చేశారు! అంటే... సినిమాలో సుదీప్ కనిపించబోయే గెటప్ టెస్ట్ షూట్ చేశారన్న మాట! ఫస్ట్ లుక్ కోసం కొన్ని స్టిల్స్ తీసుకున్నారు. త్వరలోనే సుదీప్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారట! అలాగే, త్వరలో ఈ సినిమా షూటింగ్ కోసం సుదీప్ న్యూయార్క్ వెళ్లనున్నారు. సినిమాలో సుదీప్‌కి ఇంపార్టెంట్ క్యారెక్టరే వచ్చినట్టుంది. ఎందుకంటే... ట్రైలర్‌లోనూ ఈ హీరో కనిపిస్తారని ఎడ్డీ తెలిపారు.